మంత్రి కొడుకుతో….హీరోయిన్ సాయిప‌ల్ల‌వి మ్యారేజ్.!

మ‌ల‌ర్ పాత్ర‌తో..మ‌ల‌యాలీస్ ను, బానుమ‌తి పాత్ర‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌ను ఫిదా చేసిన హీరోయిన్ సాయిప‌ల్ల‌వి.!

ఫిదా’తో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసిన సాయిపల్లవి సినీ ప్రేక్షకులకు ఎప్పుడూ ఓ పజిల్‌గానే కనిపిస్తూంటుంది. మిగతా హీరోయిన్లకు భిన్నంగా, మాట్లాడడమే కాకుండా, వెరైటీ కధలతో సినిమాలు చేస్తుంటుంది. ఏ కధ అయినా సాయిపల్లవి చేసే సూపర్‌ డూపర్‌ హిట్‌ అవుతుందన్న మాటను సొంతం చేసుకుంది. అలాంటి సాయిపల్లవి పెళ్ళికి రెడీ అయిపోయిందంటున్నారు సినీజనాలు. దక్షిణాదికి చెందిన ఓ మంత్రి కొడుకు సాయిపల్లవిని చూసి మనసు పారేసుకున్నాడట! ఆ కొడుకుగారు కూడా సినిమాకు చెందిన వ్యక్తే. కాకపోతే అతగాడి ప్రపోజల్‌కు సాయి పల్లవి ‘నో’ అనేయడంతో ఆ హీరోగారు తన తండ్రితో రికమెండ్‌ చేయించాడట! సాక్షాత్తు మంత్రిగారు వచ్చి పిల్లనివ్వమని అడగడంతో సాయిపల్లవి పేరెంట్స్‌ కొద్దిగా ఇబ్బంది పడ్డారట! ప్రస్తుతం సాయిపల్లవి రెండు మూడు సినిమాలకు కమిట్‌ అయి ఉంది. అవి పూర్తయిన తరువాత పెళ్ళి చేద్దామని ఆమె తల్లిదండ్రులు అన్నారట! ప్రస్తుతానికి మంత్రిగారి కొడుక్కి, సాయిపల్లవికి ఎంగేజ్‌మెంట్‌ చేసి ఆ తరువాత పెళ్ళి చేయాలని ఇద్దరి పేరెంట్స్‌ అనుకున్నారట! కాకపోతే ఈ విషయంలో ఇరువైపుల నుంచి పూర్తి సమాచారం రావడం లేదు.

Comments

comments

Share this post

scroll to top