భార్యతో విడాకుల విషయం పై ట్విస్ట్ ఇచ్చిన మంచు మనోజ్ ..!

మంచు మనోజ్ ఈమధ్య ఒక పబ్ లో జరిగిన సంఘటనలో హడావిడి చేసినట్లుగా వార్తలు వచ్చాయి. ఆ సంఘటన మరిచిపోకముందే మనోజ్ తన భార్య ప్రణతితో విడిపోతున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈవార్తలు విన్నవారు మాత్రం చాలామంది ఆశ్చర్యపోయారు. దీనికి కారణం మనోజ్ ప్రణతిని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.

మూడేళ్ళ క్రితం పెళ్లి చేసుకున్న వీరిద్దరి మధ్య ఇప్పుడు సరైన సంబంధాలు లేవని వీరిద్దరిమధ్య భేదాభిప్రాయాలు రావడంతో మంచు కుటుంబం సద్దుబాటు ప్రయత్నాలు చేసినా అవి విజయవంతం కాకపోవడంతో ప్రణతి అమెరికాలో ఉంటున్న తన తల్లితండ్రుల దగ్గరికి వెళ్ళిపోయింది అంటూ వార్తల హడావిడి జరిగింది. అయితే ఇప్పుడు ఈవార్తల పై కొంచం ఆలస్యంగా మనోజ్ క్లారిటీ ఇచ్చాడు.

నిన్న మనోజ్ తన అభిమానులతో ట్విట్టర్ చాట్లో పాల్గొన్నప్పుడు ఒక అభిమాని మనోజ్‌ ను ఈవిషయమై ప్రశ్నించగా మంచువారి అబ్బాయి క్లారిటీ ఇచ్చాడు. ‘వాళ్ల బొంద ప్రణతి నా దేవత’ అంటూ సమాధానం ఇచ్చాడు. మనోజ్ సమాధానంతో ఈ విషయంలో అభిమానుల్లో మీడియాలో నెలకొన్న డౌట్ క్లియర్ అయినట్లయింది.

ఇదే సందర్భంలో మనోజ్ తన అన్నయ్య మంచు విష్ణు దర్శకత్వంలో నటించబోతున్నట్లు వచ్చిన వార్తల పై కూడ క్లారిటీ ఇస్తూ అలాంటి విషయాలు ఏమి లేవనీ స్పష్టం చేసాడు. అయితే తన తర్వాత చిత్రం ఒక ప్రేమ కథా చిత్రంగా ఉంటుందని ఆగస్టులో ఇందుకు సంబంధించిన షూటింగ్ మొదలవుతుందని క్లారిటీ ఇచ్చాడు. తన తండ్రి మోహన్ బాబు సినిమాలలో తాను రీమేక్ చేయవలసి వస్తే తనకు ‘అల్లుడుగారు’ సినిమా రీ మెక్ లో నటించాలని కోరిక ఉంది అంటూ అభిప్రాయపడ్డాడు. ఈమధ్య కాలంలో మనోజ్ విపరీతమైన బరువు పెరిగి పోవడంతో అతడికి ఏమాత్రం అవకాశాలు రావడం లేదు. దీనితో మనోజ్ ప్రస్తుతం తన బరువును తగ్గించుకునే ట్రీట్మెంట్ అమెరికాలో చేయించుకోవాలి అన్న ఆలోచనలలో ఉన్నట్లు టాక్..

Comments

comments

Share this post

scroll to top