మనిషి చనిపోయాక..తల దగ్గర దీపం ఎందుకు పెడతారో తెలుసా.? వెనకున్న కారణం ఇదే..!

హిందువులకు దీపం అత్యంత పవిత్రమైనది.అందుకే ఏ శుభకార్యం చేపట్టినా ముందుగా దీపారాధనతో ప్రారంభిస్తారు.అంతేకాదు గుడికి వెళ్లినా,ఇళ్లల్లో పూజ చేసినా ముందుగా దేవుడికి దీపం వెలిగిస్తారు.హిందువులలో ఎవరైనా చనిపోతే తల దగ్గర దీపాన్ని వెలిగిస్తారు.అంతేకాదు ఆ దీపం ఆరిపోకుండా జాగ్రత్తగా చూసుకుంటారు.అంతటి శక్తి కలిగిన దీపాన్ని చనిపోయిన వారి తల దగ్గర ఎందుకు పెడతారు అని ఎప్పుడైనా డౌట్ వచ్చిందా..దానికి సమాధానం తెలుసుకోండి.

మనం బతికి ఉన్నప్పుడు దీపం చీకటిలో ఎలా దారి చూపిస్తుందో అదే విధంగా చనిపోయిన తర్వాత కూడా దీపం మోక్ష మార్గం చూపుతుందని చెబుతారు. అయితే మరణించిన తర్వాత వారి ఆత్మ బ్రహ్మ కపాలం నుంచి బయటకు వస్తేనే వారి ఆత్మకు మోక్ష మార్గం దొరుకుతుందని మన పురాణాలు చెబుతున్నాయి. మరణించిన తర్వాత బ్రహ్మ కపాలం నుంచి శరీరం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆత్మమోక్ష మార్గానికి వెళ్లడానికి రెండు మార్గాలున్నాయి. ఒకటి ఉత్తరమార్గం, రెండోది దక్షిణ మార్గం. దక్షిణ మార్గంలో చీకటి ఉంటుంది. ఉత్తరమార్గంలో వెలుగు ఉంటుంది. బయటకు వచ్చిన ఆత్మకు తల పక్కన ఉన్న దీపం ఉత్తరమార్గం వైపునకు వెళ్లడానికి దారి చూపిస్తుందని చెబుతున్నారు.అయితే ఇలా తల దగ్గర ఉన్న దీపమే వెలుగు చూపించి సహాయం చేస్తుందని, అందుకే మరణించిన తర్వాత తల దగ్గర దీపం పెట్టడం ఆనవాయితీగా వస్తుందని పురాణాలూ చెబుతున్నాయి.

Comments

comments

Share this post

scroll to top