మొన్న చిరంజీవి ఇంట్లో..ఇప్పుడు “మణిశర్మ” ఆఫీస్ లో..! దొంగతనం ఎవరు చేసారో తెలుస్తే షాక్..!

ఈ మద్య సెలబ్రెటీల ఇళ్లల్లో చోరీలు బాగా జరుగుతున్నాయి.మొన్న మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో దొంగతనం జరుగగా..ఆ తర్వాత నటి రోజా ఇంట్లో కూడా చోరి జరిగింది.    తాజాగా ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ ఇంట్లో చోరి జరిగింది అనే వార్త టాలివుడ్లో హాట్ టాపిక్ గా మారింది.అయితే బాగా నమ్మకంగా ఉండేవాళ్లే ఈ చోరిలకు పాల్పడడం విషాదం..
చిరంజీవి ఇంట్లో చెన్నయ్య అనే వ్యక్తి గత కొంతకాలంగా పనిచేస్తున్నాడు .అతడే దొంగతనం చేసాడని పోలిసుల దర్యాప్తులో తేలడంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు.  చెన్నయ్య ని సొంత మనిషిలా చూసుకున్నాం .కానీ అతడు పాడు పని చేసి నమ్మకాన్ని కోల్పోయాడని చిరు ఎమోషనల్ అయ్యారు. తర్వాత రోజా ఇంట్లో పనిచేసే పనమ్మాయి దొంగతనం చేసిందనే వార్తలొచ్చాయి..ఇప్పుడు మణిశర్మ ఇంట్లో దొంగతనం చేసింది ఆఫీస్ బాయేనట.
బీరువాలో ఉంచిన రూ.4లక్షల రూపాయలు  కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు మణి శర్మ. ఈ చోరీ చేసింది మణిశర్మ ఆఫీస్ లో ఆఫీస్ బాయ్ గా పనిచేస్తున్న వెంకటేష్ అని తేలింది. అతడు గత 10 ఏళ్ల నుంచి మణిశర్మ ఆఫీస్ లో పనిచేస్తున్నాడట. పోలీస్ లు అనుమానంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించాడు. తన ఆఫీస్ లో చోరీకి పాల్పడింది ఆఫీస్ బాయ్ అని తెలుసుకున్న మణిశర్మ షాక్ కి గురయ్యాడట. గతంలో చిన్న చిన్న దొంగతనాలు జరిగినా మణిశర్మ పెద్దగా పట్టించుకోలేదట. దీనితో వెంకటేష్ అదును చూసి భారీ చోరీకి పాల్పడ్డాడని పోలీసులు మీడియాకు తెలిపారు.

Comments

comments

Share this post

scroll to top