ఒకప్పుడు టాప్ హీరోయిన్ “మనీషా కొయిరాలా”..కాన్సర్ తో పోరాడి..ఇప్పుడెలా మారిందో చూస్తే షాక్ అవుతారు..!

“తెలుసా..మనసా…ఇది ఏనాటి అనుబంధమో” ఈ పాట గుర్తుందా..? నాగార్జున నటించిన “క్రిమినల్” సినిమాలోని లవ్ సాంగ్. ఈ సాంగ్ లో “మనీషా కొయిరాలా” ఎంతో అందంగా కనిపించింది అనడంలో అతిశయోక్తి లేదు. ఈ సినిమాతో “మనీషా కొయిరాలా” తెలుగు ఆడియన్స్ కు పరిచయం అయ్యింది. తర్వాత “ఒకే ఒక్కడు” లో పల్లెటూరి అమ్మాయిలాగా “అర్జున్” ను “ఉమ్మా అడిగింది”. “నెల్లూరి నెరజాణ” అని పాటకూడా పాడించుకుంది. ఎంతో మందికి ఆ పాట ఫేవరెట్ గా నిలిచింది. “భారతీయుడు, బాంబే” చిత్రాల్లో కూడా నటించి తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది!

నేపాలీ సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసిన “మనీషా కొయిరాలా” ఎంతో మంది స్టార్ హీరోస్ సరసన ఎన్నో “హిందీ, తెలుగు, తమిళ్” సినిమాల్లో నటించింది. ఆడియన్స్ ప్రశంసలే కాదు అవార్డులు కూడా అందుకున్నారు “మనీషా కొయిరాలా”. ఇటీవల “కాన్సర్” తో ఇబ్బంది పడ్డారు. కాన్సర్ ను జయించి మరోసారి సినీ రంగ ప్రవేశం చేయనున్నారు. “డియర్ మాయ” అనే చిత్రంతో ఎంట్రీ ఇవ్వనున్నారు!

అయితే ఈ సినిమాలో “మనీషా కొయిరాలా” ఎలా కనిపించనున్నారో చూస్తే షాక్ అవుతారు. మీరే ఒక లుక్ వేసుకోండి!

Comments

comments

Share this post

scroll to top