ఐటీ రంగంలో..సామాజిక మాధ్యమాల్లో తనకంటూ ఎదురే లేకుండా టాప్ పొజిషన్లో ఉన్న దిగ్గజ కంపెనీలన్నీ ఇండియన్స్‌కు పట్టం కడుతున్నాయి. గూగుల్‌కు సిఇఓగా , మైక్రోసాఫ్ట్ తో పాటు అమెజాన్ కంపెనీకి ఇంద్రా నూయిని ఎంపిక చేసుకున్నాయి. మరో వైపు ప్రపంచాన్ని చిట్టిపొట్టి సందేశాలతో దుమ్ము రేపుతూ ..కోట్లాది రూపాయలను వెనకేసుకుంటున్న ట్విట్టర్ దిగ్గజం ఇండియా కంట్రీ చీఫ్‌గా..మేనేజింగ్ డైరెక్టర్‌గా మనీష్ మహేశ్వరిని నియమించింది. దీంతో భారతీయులు మరో మైలురాయిని దాటారని చెప్పవచ్చు. నిన్న అమెజాన్..ఇవాళ ట్విట్టర్లు రెండూ అమెరికాకు చెందిన కంపెనీలే. అదే స్థానంలో ఉన్న క్రిష్ శాన్ ఫ్రాన్సిస్కో లో ఉన్న ట్విట్టర్ కార్యకలాపాలు చూస్తారు.
ఇండియాలో ట్విట్టర్ కార్యకలాపాలను మనీష్ చూస్తారని ట్విట్టర్ ఛైర్మన్ వెల్లడించారు. అంతకు ముందు ఇండియా కంట్రీ హెడ్స్‌గా తరణ్ జీత్ సింగ్, బాలాజీ క్రిష్ పనిచేశారు. మహేశ్వరి అంతకు ముందు నెట్వర్క్ 18 డిజిటల్ మీడియా కంపెనీకి సిఇఓగా పనిచేశారు. ప్రపంచ వ్యాప్తంగా చూస్తే..సోషల్ మీడియా ..డిజిటల్ రంగంలో ఇండియాలోనే ఎక్కువగా వ్యాపారం కొనసాగుతోంది. ఇక్కడి నుంచే ఆదాయం సమకూరుతోంది. మార్కెట్ స్ట్రాటజీని అర్థం చేసుకోవడం, ఆదాయ వనరులను గుర్తించడం..ప్రాఫిట్‌ను తెప్పించడం మనీష్ ముందున్న సవాళ్లు. ఇప్పటికే ఇండియాలో ట్విట్టర్ కు భారీగా రెవిన్యూ సమకూరుతోంది. ఇంటర్నెట్లో గూగుల్, ఫేస్ బుక్ కంపెనీలతో ట్విట్టర్ కంపెనీ పోటీ పడుతోంది.
యూత్ ను ఎక్కువగా టార్గెట్ చేస్తున్నాయి. ట్విట్టర్‌కు ఎక్కువగా ఆదాయం వచ్చేది ఇండియా నుండే. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో ట్విట్టర్ కార్యాలయాలు ఉన్నాయి. సోషల్ మీడియాలో ట్విట్టర్ ప్రజలకు మరింత చేరువయ్యేందుకు గాను ఎండీని మార్చేశారు. ఈ విషయంలో పరుగులు పెట్టించడంలో ..ఆదాయం సమకూరేలా చేయడంలో మనీష్ వెరీ వెరీ ఎక్స్పర్ట్. మహేశ్వరి లాంటి యంగ్ అండ్ ఎనర్జటిక్ ..డైనమిక్ లీడర్ మాతో కలిసి పనిచేసేందుకు రావడం ఆనందంగా ఉందంటూ ట్విట్టర్ ఏషియా ఫసిఫిక్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ వైస్ ప్రెసిడెంట్ మాయా హరి సంతోషం వ్యక్తం చేశారు. మనీష్ కు ఉన్న అనుభవం గొప్పది. ఆయన నెట్ వర్క్ 18తో పాటు అంతకు ముందు ఫ్లిప్ కార్ట్, టీఎక్స్టి వెబ్, ఇన్ ట్యూట్, ఎంఎస్ కీన్సే,ప్రాక్టర్ అండ్ గ్యాంబిల్ కంపెనీల్లో చేశారు. అనుభవం కలిగిన వ్యక్తిగా మనీష్ ట్విట్టర్ స్థాయిని మరింత పెంచబోతున్నారు. ఆయన సక్సెస్ కావాలని కోరుకుందాం.