పండుగలు, శుభ కార్యాల‌ప్పుడు ఇండ్ల‌కు మామిడి తోర‌ణాలు ఎందుకు క‌డ‌తారో తెలుసా..?

మామిడి చెట్టు పండ్లే కాదు ఆకులు కూడా మ‌న‌కు ఉప‌యోగ‌క‌ర‌మే. వాటిని ప‌లు అనారోగ్యాలు తొల‌గించుకునేందుకు ఆయుర్వేదంలో వాడుతారు. అయితే పండుగ‌ల స‌మ‌యంలో, శుభ కార్యాలు నిర్వ‌హించిన‌ప్పుడు హిందువులు త‌మ త‌మ ఇండ్ల‌కు మామిడి ఆకులతో త‌యారు చేసిన తోర‌ణాలు క‌డుతారు క‌దా. దీని గురించి అంద‌రికీ తెలుసు. అయితే దీని వెనుక ఉన్న అస‌లైన కార‌ణం ఏంటో తెలుసా..? దాని గురించే ఇప్పుడు తెలుసుకుందాం.

ఇంటి గుమ్మానికి, బ‌య‌ట ఆవ‌ర‌ణ‌లో ఎక్క‌డైనా మామిడి ఆకుల తోర‌ణాలు క‌డితే ఆ ఇంట్లోని వాస్తు దోషం పోతుంద‌ట‌.
ఇంట్లో ఉన్న నెగెటివ్ ఎన‌ర్జీ పోతుంది. పాజిటివ్ ఎన‌ర్జీ ప్ర‌సార‌మ‌వుతుంది. దాంతో అన్నీ శుభాలే క‌లుగుతాయి.
మామిడి ఆకుల్లో ల‌క్ష్మీ దేవి ఉంటుంద‌ట. అందుకుని ఆ ఆకుల‌తో చేసిన తోరణాలు క‌డితే ఆ ఇంట్లోకి ధనం వ‌చ్చి చేరుతుంద‌ట‌. ఆర్థిక స‌మ‌స్య‌లు పోతాయ‌ట‌.
ఇంట్లో ఉండే దుష్ట శ‌క్తులు పోతాయి. దేవ‌త‌లు అనుగ్ర‌హిస్తార‌ట‌. ప్ర‌ధానంగా ఇంటి ప్రధాన ద్వారంలో నివసించే వాక్‌దేవత ఆ ఇంటికి మేలు చేస్తుందట‌.
ఇంట్లో ఉండే గాలి శుభ్ర‌మ‌వుతుంద‌ట‌. త‌ద్వారా చ‌క్క‌ని ఆరోగ్యం క‌లుగుతుంద‌ట‌. ఇంట్లో ఉండే ఆక్సిజ‌న్ శాతం పెరిగి స్వ‌చ్ఛమైన గాలి మ‌న‌కు ల‌భిస్తుంది.
మామిడి ఆకులు ప్ర‌శాంత‌త‌కు చిహ్నాలు. మామిడి ఆకుల తోర‌ణాల‌ను చూస్తే ఎవ‌రికైనా మ‌న‌స్సు ప్ర‌శాంతంగా మారుతుంద‌ట‌.

మామిడి ఆకులు శుభానికి చిహ్నాలు. అందుకే వాటి తోర‌ణాల‌ను ఆల‌యాల్లో కూడా క‌డుతుంటారు. అలాంటిది ఆ తోర‌ణాలు ఇండ్ల‌లో కూడా క‌డితే అంతా మంచే జ‌రుగుతుంద‌ని మ‌న పూర్వీకుల న‌మ్మ‌కం. పురాణాలు కూడా ఇదే విష‌యాన్ని చెబుతున్నాయి.

Comments

comments

Share this post

scroll to top