వాట్సాప్ ఫోటోల కారణంగా ఇద్దరమ్మాయిలను సస్పెండ్ చేసిన కాలేజ్.

ఇద్దరమ్మాయిలు మందు తాగుతున్న ఫోటోలు వాట్సాప్ లో చక్కర్లు కొడుతున్నాయనే కారణంతో వారిని సస్పెండ్ చేసింది మంగుళూరు లోని ఓ కాలేజ్ యాజమాన్యం..  కర్ణాటక లోని కుక్కే శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర కాలేజ్ లో BBA సెకెండ్ ఈయర్ చదువుతున్న ఇద్దరమ్మాయిలు ఓ రోజు టూరిష్ట్ స్పాట్ లో బీరు బాటిళ్లను ముందు పెట్టుకొని తాగుతున్నారు. ఫోటో ఎవరు తీసారో కానీ .. ఒక్క సారిగా ఈ  అమ్మాయిలు మందు తాగుతున్నఫోటోలు వాట్సాప్ లో జోరుగా షేరింగ్ అయ్యాయ్. అటు చేరి ఇటు చేరి  చివరికి ఈ ఫోటోలు సదరు కాలేజ్ యాజమాన్యం దృష్టికి వచ్చాయి.

మీరు తాగుతున్న ఫోటోలు వాట్సాప్ లో చక్కర్లు కొడుతున్నాయ్ … సో మిమ్మల్ని సస్పెండ్ చేస్తున్నామని యాజమాన్యం ఆ అమ్మాయిలకు  తేల్చి చెప్పింది. దీంతో సదరు విద్యార్ధులు షాక్ కు గురయ్యారు. కాలేజ్ క్యాంపస్ లో తాగితే ఈ చర్య తీసుకుంటే తప్పులేదు కానీ బయట ఎక్కడో తాగితే ..అవి ఫోటోల రూపంలో చూసి సస్పెండ్ చేయడం ఏంటని కొన్ని విద్యార్థి సంఘాలు యాజమాన్య నిర్ణయాన్ని తప్పుబడుతున్నాయి.

Watch VideO:

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top