స్త్రీలు మంగ‌ళ‌సూత్రంలో పిన్నీసులు పెట్ట‌రాదా..? పెడితే ఏమ‌వుతుందో తెలుసా..?

పురాత‌న కాలం నుంచి మ‌న పెద్ద‌లు, పూర్వీకులు పాటిస్తున్న ఆచారాలు, సాంప్ర‌దాయాలు, ప‌ద్ధ‌తులు, విశ్వాసాల గురించి చాలా మందికి తెలుసు. అయితే కొంద‌రు వాటిని మూఢ నమ్మ‌కాలని కొట్టి పారేస్తారు. కానీ వాస్త‌వానికి చెప్పాలంటే వాటిని పాటిస్తే మ‌నం కోల్పోయేది ఏమీ ఉండ‌దు. ఒక వేళ నిజంగానే అలా జ‌రిగితే మ‌న‌కు మంచిదే క‌దా. దీంతో ఆ న‌మ్మ‌కం గురించి మ‌నం ఇత‌రుల‌కు చెబుతాం. అయితే అలాంటి న‌మ్మ‌కాల్లో కొన్నింటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

 

1. స్త్రీలు మంగళ సూత్రంలో పిన్నీసులు ఉంచరాదు. అలానే కొన్నిసార్లు హెయిర్ పిన్నులను కూడా స్త్రీలు మంగళ సూత్రానికి ఉంచుతుంటారు. కానీ ఇలా వాటిని ఉంచ‌రాదు. ఎందుకంటే మంగళ సూత్రం వేద మంత్రాల సహితంగా ప్రభావితం కాబడిన భర్త ఆయువు పట్టు. మంగళ సూత్రం స్త్రీ హృదయం వద్ద ఉంటుంది. ఇనుప వస్తువులు (పిన్నీసులు, ఇనుముతో చేసినవి) దివ్య శక్తులను ఆకర్షించుకొనే గుణం క‌లిగి ఉంటాయి. ఇవి మంగళ సూత్రంలో దివ్య శక్తులను ఆకర్షించి భర్తను శక్తి హీనుడిని చేస్తాయి. దీంతో భర్తకు అనారోగ్యం క‌లుగుతుంది. భార్యాభర్తల పట్ల ఒక‌రంటే ఒక‌రికి అనురాగం తగ్గుతుంది. క‌నుక ఇలాంటి అలవాటు ఉంటే వెంటనే మానుకోవాలి.

2. స్త్రీలు మ‌ట్టి గాజులు ధ‌రిస్తే చాలా మంచిది. ఈ గాజులు ఐశ్వర్యాన్ని కలిగించటమే కాక, వీటి శబ్దం శుభాలను, అనురాగాలను పెంచుతుంది.

3. ఇంట్లో గుర్రం బొమ్మలు ఉంచ‌డం అంత క్షేమం కాదు. దీని వ‌ల్ల డబ్బు విపరీతంగా ఖర్చవుతుందట‌. వ‌చ్చినా నిల‌వ‌ద‌ట‌.

4. సంపదలను, న‌గ‌ల‌ను ఎక్కువగా ప్రదర్శించ‌డం వల్ల నరఘోష ఏర్పడుతుంది. తద్వారా చెడు జరుగుతుంది. క‌నుక ఎవ‌రైనా సాధార‌ణ అలంక‌ర‌ణ చేసుకోవ‌డం ఉత్త‌మం. అలాగే ఉంది క‌దా అని సంప‌ద‌ను కూడా ప్ర‌దర్శించ‌రాదు.

5. ఆడపడుచులు, అత్తమామలతో విభేదాలు ఎక్కువైతే, వారు వివాహిత స్త్రీల‌ను ఇబ్బందులు పెడుతుంటే వారు పడుకునే దిండు కింద తులసి వేరు ఉంచాలి. దీంతో వారు ఆ స్త్రీల‌ను ఆప్యాయంగా చూసుకుంటారు. విరోధాలు కూడా తగ్గిపోతాయి.

6. వంట చేసేప్పుడు రెండు బియ్యం గింజల‌ను తీసుకుని భక్తితో అగ్నికి స్త్రీలు సమర్పించాలి. దీంతో వంటకాలు ఎంతో రుచిగాను, ఆరోగ్యకరంగాను ఉంటాయి.

7. భర్త తాగి వచ్చి హింస పెడుతుంటే ఉదయం పూట టిఫిన్ చేసిన తరువాత ఒక చిన్న స్పూన్ అంటే సుమారు అర గ్రాము కరక్కాయ పౌడరును ఆరు చెంచాల నీటిలో కలిపి స్త్రీలు తాగించాలి. ఇలా 60 రోజులు చేస్తే వాళ్లకు తాగుడుపై విరక్తి కలుగుతుంది. కరక్కాయ పొడి ఆరోగ్యానికి చాలామంచిది. మొదట దీనిని తాగనని మారాం చేస్తారు. కొద్దిగా బతిమాలి తాగించటం అలవాటు చేయాలి. ఈ ఔషధం తాగుడును మాన్చుతుంద‌ట‌. దీన్ని కొంద‌రు అనుభ‌వ పూర్వ‌కంగా చెబుతున్నారు.

8. సుఖ సంతోషాలు కరువైనవారు పసుపు రంగు పూలు ధరించాలి. దీంతో వారి స్థితి మెరుగవుతుంది.

9. అప్పుల బాధ ఎక్కువగా ఉన్న‌వారు తెలుపు రంగు పూలు ధరిస్తే రుణ బాధలు తగ్గుతాయి.

10. ఆరోగ్యం సరిగా లేని వారు, శరీరం నొప్పులు వున్నవారు మరువం, మందారాలు కలిపి ధరించాలి. దీంతో 20 రోజులలో ఫలితం కనిపిస్తుంది.

11. పెళ్ళి చూపులప్పుడు ఎరుపు పూలు, పసుపు పూలు కలిపి మాలకట్టి ధ‌రించాలి. వివాహం విషయంలో కన్యలకు ఎంతో శుభకరంగా ఫలితాలొస్తాయి .

12. మంచి తీర్థంలో రెండు తులసి దళాలు వేస్తే అవి మానస సరోవర జలాలంత పవిత్రమవుతాయి.

13. పూజ చేసేట‌ప్పుడు కూర్చునే పీఠానికి శుభ్రం చేసి నాలుగు మూలలా బొట్లు పెట్టి కూర్చోవాలి. చాపైతే విభూది బొట్లు ఉన్న‌ గుడ్డను ఆసనంగా వాడితే కుంకుమ బొట్లను పెట్టి కూర్చోవాల్సి ఉంటుంది.

14. భర్త బయటకు వెళ్లేందుకు చొక్కా వేసుకుంటుంటే, గుండీలను స్త్రీలు పెట్టాలి. స్త్రీ కుడి చేతిని తాకి భ‌ర్త వెళ్లాలి. దీంతో ఆ రోజు భర్తకు సంపాదన‌, విజయం, సంతోషం వెంట ఉంటాయి.

Comments

comments

Share this post

scroll to top