పవన్ కళ్యాణ్ కు అండగా నిలిచిన మంచు మనోజ్… జనసేన లో ముఖ్య పాత్ర పోషించనున్నాడా.?

మంచు మనోజ్ ట్విట్టర్ లో ఎప్పుడు యాక్టీవ్ గా ఉంటాడు, ఇటీవల కాలం లో మరీ ఎక్కువగా యాక్టీవ్ గా ఉన్నాడు, మంచు మనోజ్ రాజకీయాల వైపు ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నట్టు కనిపిస్తుంది, ఒక్కడు మిగిలాడు ఆడియో ఫంక్షన్ అప్పుడు మంచు మనోజ్ ఇచ్చిన స్పీచ్ జనాలను షాక్ కి గురి చేసింది. ‘త్వరలోనే సినిమాలకు బాయ్ బాయ్ చెప్పి ప్రజా సేవ లో లీనమవుతా’ అని మంచు మనోజ్ తెలిపాడు, ఒక్కడు మిగిలాడు సినిమా తరువాత మరొక సినిమా మొదలెట్టలేదు మంచు మనోజ్, కానీ ట్విట్టర్ లో మాత్రం రాజకీయాలకు సంబందించిన ట్వీట్స్ తో జనాలను ఆకట్టుకుంటూనే ఉన్నాడు.

ఏ జనసేన అచ్చ హయ్.. :

జనసేన పార్టీ లోకి పలువురు రిటైర్డ్ ఐఏఎస్, ఐపిఎస్ ఆఫీసర్స్ జాయిన్ అయ్యారు ఇటీవల, ‘చాలా మంది విద్యావేత్తలు జనసేన పార్టీ లో చేరుతుండటం మంచి విషయం అని మంచు మనోజ్ తన ట్విట్టర్ లో పేర్కొన్నాడు, పవన్ కళ్యాణ్ గారు విద్యావేత్తలను రాజకీయాల్లోకి ఆహ్వానించడం హర్షించదగిన విషయం, చాలా మంచి పని చేస్తున్నారు’ అని ట్వీట్ వేసాడు మంచు మనోజ్.

మెగా అభిమానులు.. :

మంచు మనోజ్ జనసేన కు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో మద్దతిచ్చినట్టు అయ్యింది, మెగా ఫ్యాన్స్ అంతా మంచు మనోజ్ కి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. త్వరలోనే మంచు మనోజ్ జనసేన పార్టీ లో చేరనున్నాడని పుకార్లు మొదలెట్టారు కొందరు నెటిజన్స్, అయితే ఈ పుకార్లు నిజమవుతాయా లేదో ఇంకొన్ని రోజుల్లో తెలియనుంది. అయితే ఎవరు మంచి పని చేసినా మంచు మనోజ్ ముందు ఉంటాడు మెచ్చుకోవడం లో, విద్యావంతులని రాజకీయాల్లో ప్రోత్సహిస్తున్నందుకు పవన్ కళ్యాణ్ ని అభినందించాడు, అంతే కానీ పార్టీ లో చేరడు అని మరికొందరు అంటున్నారు.

మోడీ మీద విరుచుపడుతున్నాడు… :

మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి పైన మంచు మనోజ్ విరుచుకుపడుతున్నాడు కొంత కాలం నుండి, ఒకటి కాదు రెండు కాదు, మోడీ మీద వరుస పెట్టి నెగిటివ్ గా ట్వీట్స్ వేస్తున్నాడు మంచు మనోజ్. తెలుగు ప్రజలను మోసం చేసాడు అని మంచు మనోజ్ మోడీ పైన చాలా అంటే చాలా కోపంగా ఉన్నాడు. అయితే నరేంద్ర మోడీ సపోర్టర్స్ మంచు మనోజ్ పైన నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు, కానీ మనోజ్ మాత్రం మోడీ గారు అంటూ రెస్పెక్ట్ ఇస్తూ మరీ ట్రోల్ చేస్తున్నాడు. ట్రోల్ చేసే వారికి సమ్మగా రాడ్స్ దింపుతున్నాడు.

 

Comments

comments

Share this post

scroll to top