స్టేజ్ మీద యాంకర్ అనసూయను ఆటపట్టించిన హీరో!

టెలివిజన్ రంగంలో హోస్ట్ గా రాణిస్తూనే, స్టార్ హీరోల సినిమాల ఫంక్షన్ లకు వ్యాఖ్యాత వ్యవహరిస్తూ అనతికాలంలోనే మంచి క్రేజ్ సంపాదించుకున్న యాంకర్ అనసూయ.మోహన్ బాబు., అల్లరి నరేష్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘ మామ మంచు అల్లుడు కంచు’ ఆడియో సక్సెస్ మీట్ ఫంక్షన్ రీసెంట్ గా తిరుపతిలో జరిగింది. అయితే ఈ కార్యక్రమానికి యాంకర్ గా చేస్తున్న అనసూయ మధ్యలో కొన్ని ఇంగ్లీష్ పదాలు మాట్లాడుతూ, ఎలాగోలా అర్థం చేసుకోండని ప్రేక్షకులను ఉద్దేశించి అంది. ఇక స్టేజ్ పైకి వచ్చిన రాక్ స్టార్ మంచు మనోజ్, అనసూయను పాపా అనసూయ ఇలా రామ్మా అంటూ.. ఏం వయ్యారంగా నడుస్తుందో, మా తిరుపతి ప్రేక్షకులకు ఇంగ్లీష్ రాదనుకున్నావా? అని నవ్వుతూ చిన్న వార్నింగ్ ఇచ్చాడు. ఇదంతా యాంకర్ అనసూయను ఆటపట్టించడానికే మనోజ్ చేశాడని తెలియడంతో అందరూ ఒక్కసారిగా నవ్వుకున్నారు.

Watch Video:

 

Comments

comments

Share this post

scroll to top