మంచు మనోజ్ మోడీ ని ఆట ఆడుకుంటున్నాడు… అడ్డొస్తే రాడ్ లు దింపుతున్నాడు రిప్లైస్ తో..!!

మంచు మనోజ్, మంచి జోష్ ఉన్న హీరో. ఫైట్స్, డాన్స్, యాక్టింగ్, కామెడీ.. ఇలా అన్నిట్లోనూ ప్రతిభావంతుడే. టైం కలిసి రాకనో, మంచి సినిమాలు పడకనో స్టార్ హీరో కాలేకపోయాడు, కానీ మంచి పేరు మాత్రం సంపాదించుకున్నాడు. ఇటీవల కాలం లో సినిమాలు తగ్గించేసాడు. ‘ఒక్కడు మిగిలాడు’ సినిమా తరువాత ఇంకో సినిమా ప్రారంభించలేదు మంచు మనోజ్. కానీ ట్విట్టర్ లో మాత్రం రోజుకొక కొత్త సినిమా చూపిస్తున్నాడు.

అయ్యో మోడీ గారు. :

మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి పైన మంచు మనోజ్ విరుచుకుపడుతున్నాడు కొంత కాలం నుండి, ఒకటి కాదు రెండు కాదు, మోడీ మీద వరుస పెట్టి నెగిటివ్ గా ట్వీట్స్ వేస్తున్నాడు మంచు మనోజ్. తెలుగు ప్రజలను మోసం చేసాడు అని మంచు మనోజ్ మోడీ పైన చాలా అంటే చాలా కోపంగా ఉన్నాడు. అయితే నరేంద్ర మోడీ సపోర్టర్స్ మంచు మనోజ్ పైన నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు, కానీ మనోజ్ మాత్రం మోడీ గారు అంటూ రెస్పెక్ట్ ఇస్తూ మరి ట్రోల్ చేస్తున్నాడు. ట్రోల్ చేసే వారికి సమ్మగా రాడ్స్ దింపుతున్నాడు.

కుల పిచ్చి నీకు ఉంది బ్రదర్.. :

ట్విట్టర్ లో ఒక వ్యక్తి, మంచు మనోజ్ ట్వీట్ కి రిప్లై ఇస్తూ.. ‘మోడీ ఇచ్చిన డబ్బుల్ని చంద్రబాబు నాయుడు ఏం చేసాడని అసలు, మోడీ మీద అరుస్తున్నావ్, ముందు కుల ముసుగు నుండి బయటకు రా’ అని తిట్టగా, మంచు మనోజ్ అతగాడి ట్వీట్ కు రిప్లై ఇస్తూ, ‘కుల పిచ్చి ఉంది నాకు కాదు బ్రదర్. నీకు, నా పేరు లో కులం లేదు. కానీ నీ పేరు లో నీ కులం పేరు ఉంది. ఇక్కడే తెలుస్తుంది ఎవరికి కుల పిచ్చో, లవ్ యు బ్రదర్ జాగ్రత్త’.. అని ట్వీట్ వేసాడు మంచు మనోజ్, అదే ట్వీట్ లో వాళ్ళ అక్క మంచు లక్ష్మి ఫేమస్ డైలాగ్, నిలదీస్ ఫై కూడా వాడాడు మంచు మనోజ్.

ఇది మొదటి సారి కాదు.. :

ట్విట్టర్ లో మంచు మనోజ్ ని ట్యాగ్ చేసి వాళ్ళ ఫ్యామిలీ ట్రోల్ల్స్ ఏ తనకి చూపిస్తారు కొందరు ట్విట్టర్ జనాలు, వాటికి మంచు మనోజ్ చాలా కూల్ గా రెస్పాండ్ అవుతాడు, ట్రోల్ల్స్ ని ఎప్పుడు సీరియస్ గా తీసుకోడు మంచు మనోజ్. మంచు మనోజ్ తరహాలోనే హీరో సిద్దార్థ్ కూడా ఈ మధ్య కాలం లో సోషల్ మీడియా లో బాగా బిజీ అయ్యాడు. ముఖ్యంగా ట్విట్టర్ లో. ఫ్యాన్స్ పొగడ్తలకి రిప్లైస్ ఇస్తూ, యాంటీ ఫాన్స్ తిట్లకు రిప్లైస్ ఇస్తూ సిద్ధార్థ్ ట్విట్టర్ ని ఊపేస్తున్నాడు.

Comments

comments

Share this post

scroll to top