“బిగ్ బాస్” షోలో జోష్ పెంచడానికి ఆ ఇద్దరు వైల్డ్ కార్డు ఎంట్రీ ఇవ్వనున్నరంట? ఇంతకీ వారెవరు?

తెలుగు టెలివిజన్ చరిత్రలో తొలిసారిగా ఎన్టీఆర్ హోస్ట్‌గా చేస్తున్న ‘బిగ్ బాస్ షో’ ఇటీవల ప్రారంభమై టాప్ రేటింగ్స్‌తో దూసుకుపోతుంది. తొలిరోజు బిగ్ బాస్ షో హౌస్‌లోకి 14 మంది ఎంట్రీ ఇవ్వగా సెలబ్రిటీల పరిచయాలతో సందడిగా మారింది. ఇక మూడో ఎపిసోడ్‌లో ఓ కొత్త టాస్క్‌ను ఫేస్ చేశారు బిగ్ బాస్ కుటుంబ సభ్యులు. ఆదర్శ్ ఓవర్ ఆక్షన్, ప్రిన్స్ అమ్మాయి కావాలి అనడం. ఇక ధన్రాజ్ ముమైత్ ఖాన్ హగ్ కి అయితే ఒక రేంజ్ లో ట్రోల్ చేసారు. మొదటి రోజు సమీర్ ఓవర్ చేస్తే, రెండో రోజు ఆదర్శ్, ధన్రాజ్ చేసారు. వారి మీద సోషల్ మీడియాలో ఎన్నో ట్రోల్ల్స్ వచ్చాయి.హరితేజ ఏమో ప్రిన్స్ పెళ్లి టాపిక్ వస్తే పర్సనల్స్ ఎందుకు అనింది. ఎప్పటిలాగే మహేష్ కత్తి నాకేం సంబంధం లేదు అని ఎంజాయ్ చేస్తున్నాడు. సంపూ కూల్ నెస్ లో ధోని ని మించిపోయాడు. సీరియస్ గా గొడవ పడుతున్న వారి దగ్గరికెళ్లి సన్న పిన్ చార్జర్ ఉందా అని అడిగాడు. మధుప్రియ అయితే ఏడవటం లో పీక్ లెవెల్ పెర్ఫార్మన్స్ ఇచ్చింది. అందుకే వారిని కూడా ట్రోల్ చేసారు.

మొత్తానికి షో మాత్రం ఆడియన్స్ అంచనాలను అందుకోలేకపోయింది. ఇందులో పాల్గొంటున్న వారి నుంచి ఆశించిన స్థాయిలో జోష్ రావడం లేదని షో నిర్వాహకులు భావిస్తున్నారట. దాంతో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా మంచు లక్ష్మిని, యాంకర్ అనసూయను పంపించాలని భావిస్తున్నారని సమాచారం.

అయితే స్టార్టింగ్ ఎపిసోడ్స్ కనుక .. షో వెంటనే పుంజుకోవలసిన అవసరం వుంది. అందువలన సాధ్యమైనంత త్వరగా అనసూయను పంపిస్తే ప్రయోజనం ఉంటుందనేది నిర్వాహకుల ఆలోచనగా తెలుస్తోంది. అయితే అనసూయ చాలా ప్రోగ్రామ్స్ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఆమె బిగ్ బాస్ హౌస్ లో ఉండిపోతే .. అవన్నీ డిస్టర్బ్ అవుతాయి. అయినా ఈ షో నిర్వాహకులు అనసూయతో సంప్రదింపులు జరుపుతున్నారట.

Comments

comments

Share this post

scroll to top