దేవుని పేరు చెప్పి మీరంతా మొగుళ్ళ‌య్యిర్రు….! సాంఘీక దురాచారాన్ని ఎండ‌గ‌ట్టిన మంచినీళ్ళ‌ బావి.!

జోగినీ వ్య‌వ‌స్థను ఇతివృత్తంగా తీసుకొని ….ఓ వివాహిత ఆ వ్య‌వ‌స్థ‌కు వ్య‌తిరేఖంగా ఏవిధంగా పోరాడిందనే క‌థ‌తో విడుద‌లైన ఇండిపెండెంట్ చిత్రం మంచినీళ్ళ‌బావి. గంగాధ‌ర్ అద్వైత ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కించ‌బ‌డ్డ ఈ చిత్రం…..కొన్నేళ్ళ క్రితం వ‌ర‌కు తెలంగాణాలో ఉన్న సాంఘీక దురాచార‌మైన జోగినీ వ్య‌వ‌స్థ‌ను క‌ళ్ళ‌కు క‌ట్టింది. షార్ట్ ఫిల్మ్స్ కేవ‌లం టైమ్ పాస్ కోస‌మే అన్న‌ట్లుగా మారిపోతున్న ఈ స‌మ‌యంలో….దాదాపు గంట పాటు….మంచి కంటెంట్ ఉన్న షార్టీని చాలా క్లీన్ గా ప్ర‌జెంట్ చేశాడు ద‌ర్శ‌కుడు.

కొత్త‌గా అత్తారింట్లో అడుగుపెట్టిన ఆడ‌ప‌డుచు మీద దొర క‌న్ను ప‌డ‌డం, ఆమెను లోబ‌ర్చుకోవ‌డం కోసం దేవుడితో పెళ్లి చేయాల‌నే ఆచారాన్ని లేవ‌నెత్త‌డం….ఇవి నిజంగా తెలంగాణాలోని అనేక గ‌డీల్లో జ‌రిగిన ఉదంతాలే…ఎన్నో తెలంగాణ న‌వ‌ల‌ల్లో వీటి ప్ర‌స్తావ‌న కూడా మ‌న‌కు క‌నిపిస్తుంది. అదే ఇతివృత్తాన్ని తీసుకొని ఓ ఇండిపెండెంట్ చిత్రాన్ని నిర్మించ‌డం నిజంగా అభినందించ‌ద‌గ్గ విష‌యం.

ముఖ్యంగా….గంగ‌, మునెమ్మ‌, దొర పాత్ర‌లు అప్ప‌టి వాస్త‌విక ప‌రిస్థితుల‌ను క‌ళ్ళ‌కు క‌ట్టాయి.! సినిమాలోని డైలాగ్స్ చాలా ఆక‌ట్టుకున్నాయ్.! కెమెరా వ‌ర్క్, ఎడిటింగ్ కూడా సినిమాను మ‌రింత క‌ళాత్మ‌కంగా చూపించాయ్…ఇక ఓ ఇండిపెండెంట్ సినిమా కోసం ఏకంగా రెండు పాట‌ల‌ను స్వ‌ర‌ప‌ర్చ‌డం..అందులో ఓ పాట RP ప‌ట్నాయ‌క్ చేత పాడించ‌డం విశేషం.

Watch Manchi Neella Bavi – Telugu Short Film  :

Comments

comments

Share this post

scroll to top