తాను యాచించి సంపాదించిన సొమ్ముతో తనకేం సంబంధం లేని ఆడపిల్లలకు బంగారు చెవిపోగులను చేయించాడు.

గుజరాత్ రాష్ట్రంలో  మగర్పా అనే ఊర్లో ఉన్న అంగన్ వాడీ స్కూల్ దగ్గర మహిళా టీచర్లు మరియు కొందరు ఆడపిల్లలు ఒక వ్యక్తి కోసం ఎదురుచూస్తున్నారు. కొద్దిసేపటి తర్వాత ఒక వ్యక్తి రెండు చేతులకు ఊతకర్రలు, చిరిగిన దుస్తులు, చెదిరిపోయిన జుట్టుతో అక్కడికి వచ్చాడు. అతను రాగానే  అందరూ నమస్తే భాయ్ అని దండాలు పెట్టి, అతని చుట్టూ చేరారు. ఆ వ్యక్తి తాను తెచ్చిన  బంగారు చెవిపోగులను  అక్కడున్న ఆడపిల్లలకిచ్చి  తిరిగి పయనమయ్యాడు.

అతని పేరు ఖింజిభాయ్ , అతడు ఓ భిక్షగాడు…. వినడానికి  ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం.ఆడపిల్లలంటే చాలు ఓ అన్నగా ముందుకొచ్చి వాళ్ళను ఆదుకుంటాడు.  ముఖ్యంగా పేదపిల్లలకు, చదువుకోలేక ఇబ్బందులు పడుతున్న చిన్నారులకు పుస్తకాలు,స్కూల్ యూనిఫాంలను  అందిస్తూ ఉంటాడు.. అయితే ఎందుకో ఈ సారి ఆడపిల్లలకు బంగారు చెవిపోగులను ఇవ్వాలనుకున్నాడు  అనుకున్నదే తడవుగా అంగన్ వాడీ టీచర్ కు ఈ విషయం చెప్పి… దారిద్ర్యానికి దిగువనున్న వారిని గుర్తించి వారిని తీసుకురమ్మని చెప్పాడు..అలా వచ్చిన వారికి అతడు బంగారు చెవిరింగులను అందించాడు.
beggar
ఈ బంగారు చెవిపోగులను అందుకున్న కుమద్ లుహారియా తల్లి ఈ సందర్భంగా మాట్లాడుతూ… రోజు పూటగడవడం కోసమే కష్టపడుతున్నాం. జీవితంలో అసలు బంగారు చూస్తామని కలలో కూడా అనుకోలేదు అని ఆమె తల్లి చెప్పింది. యాచన ద్వారా సంపాదించిన డబ్బుతో ఆడపిల్లలకు బంగారు చెవిపోగులు చేయిస్తున్నానని, బంగారు షాపు యజమాని దీపక్ షాకు ఈ విషయం చెప్పగా ఒక జత 13,000 వస్తుందని, అయితే  ఖింజిభాయ్ చేస్తున్న మంచిపనిలో భాగస్వామ్యం అవుతున్నందుకు 3000 తగ్గించానని దీపక్ షా తెలిపాడు.
గడిచిన పదేళ్లుగా యాచన ద్వారా వచ్చిన డబ్బుతో స్కూల్ యునిఫామ్, పుస్తకాలు, స్కూల్ ఫీజ్ ఇలా రూ.80,000లకు పైగా పేద ఆడపిల్లలకు ఖర్చుచేశాడు. ఇదంతా ఎందుకు చేస్తున్నారని ఆయనను అడిగితే..”ఆడపిల్లలు చదువుకోవాలి, వారి చదువుకు తోడ్పడాలి, వారి సొంత కాళ్ళపై వారు నిలబడేలా వారికి అండగా ఉండాలి, మనం కష్టపడైనా వారిని ఉన్నత స్థానంలో నిలబెట్టాలి. ఇక్కడ పరిస్థితి ఏం బాగోలేదు. ఆడపిల్లలే కాదు మగపిల్లలు చదువుకోవడానికి చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తోంది. ఆడపిల్లలు ఉన్నత స్థానంలో తమను తాము గౌరవించుకునే స్థానంలో ఉండాలని’ చెబుతున్నాడు ఈ గొప్పమనిషి.
ఇలా ఇదంతా చేసి, తనకు ఏమి సంబధం లేదన్నట్లుగా మళ్ళీ తన డైలీ స్పాట్ కు వెళ్లి, యాచన చేస్తూ, వారికి అండగా నిలుస్తున్నాడు ఖింజిభాయ్. చేసే వృత్తిలో చాలా మంది మోసం చేస్తున్నారు. మాయమాటలు చెబ్తూ భిక్షాటన చేసి కొందరు మోసం చేస్తుంటే, ఆడపిల్ల చదువుకోసం పరితపిస్తూ యాచన చేస్తున్న ఖింజిభాయ్ చేస్తున్న పని గొప్పదని నా ఫీలింగ్. మరి మీరేమంటారు.

Comments

comments

Share this post

scroll to top