తాను చనిపోయింది. కానీ అయిదుగురిని బ్రతికించింది.

manaswini
ఈ ఫోటో చూశారుగా….  మోము పై అమాయకమైన చిరునవ్వు, కల్మషం అంటే ఏంటో  కూడా ఎంటో తెలియని ఆ కళ్ళు. పాపను చూడగానే ఎత్తుకొని  ఆత్మీయంగా గుండెకు హత్తుకోవాలని ఉంది కదా..! కానీ విధి అనేది ఉంటుంది చూడండి అది చాలా విచిత్రమైనది. మనకే కాదు ఆ అవకాశాన్ని ఆమె కుటుంబ సభ్యులకు కూడా దక్కకుండా దూరం చేసింది. కానీ లోకాన్ని విడిచిపెడుతూ కూడా ఈ చిన్నారి 5 గురికి పునర్జీవనాన్ని ఇచ్చి వారి జీవితాల్లో వెలుగు నింపింది.
ఈ పాప పేరు మనస్విని 4 వ తరగతి చదివే ఈ పాప కుటుంబ సభ్యులతో కలిసి పుష్కరాలకు వెళ్లింది. గోదారమ్మ కు మొక్కి స్వంత ఊరికి తిరిగి పయనమైంది, అంతలో అనుకోని ఘటన జరిగిపోయింది. వారు ప్రయాణిస్తున్న కారుకు  యాక్సిడెంట్ అయ్యింది , కళ్ళ మూసి తెరిచే లోపే చెల్లాచెదురుగా పడిన  మృత దేహాలు, మిన్నంటుతున్న ఆహాకారాలు..ఆ ప్రమాదంలో మనస్విని నాన కూడా చనిపోయారు. మనస్వినికి బ్రెయిన్ డెడ్ అయ్యింది. బోసినవ్వుల పాప, కల్లా కపటం తెలియని పాప అలా విగత జీవిగా పడిపోయింది… మనస్విని అనంత లోకాలకు పయనమవుతూ అయిదుగురికి ప్రాణ దాత కావొచ్చని జీవన్ ధాన్ ద్వారా తెలుసుకున్న మనస్విని తాతయ్య ముందుకొచ్చాడు. మనస్విని దేహంలో పనికి వచ్చే
కిడ్నీలు, కాలేయం, రెండు గుండె కవాటాలను దానం చేసారు. పాప  భౌతిక కాయాన్ని ఉస్మానియా మెడికల్‌ కాలేజీకి దానం చేశారు.
manaswini
చిట్టితల్లి నువ్వు మాకు అదర్శం …  ఆ దేవుడు నిన్ను తీసుకొని వెళ్లి ఉండవచ్చు కానీ, నీ అవయవాలు అమర్చిన  అయిదుగురిలో నిన్ను చూసుకొని  మీ అమ్మ  కంట తడి కాస్తైనా ఆగాలని కోరుకుంటున్నాం…  నేను నీ ఆత్మసాక్షిగా ప్రతిజ్ణ చేస్తున్నాను. నా మరణం తర్వాత  నా అవయవాలను తప్పకుండా దానం చేస్తాను.  RIP Manaswini.

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top