ఏదో పెద్ద హీరోయిన్ అయినట్టు ఓవర్ చేసింది..! ఎన్టీఆర్ బిగ్ బాస్ ను ఎలా అవమానించిందో తెలుసా..? కానీ చివరికి!

‘మానస హిమవర్ష’ తెలుగు సినిమాల్లో ఇప్పుడిప్పుడే పైకి వస్తున్న నటి. ఈమధ్య కాలంలో మానస… పవర్ స్టార్ నటించిన కాటమరాయుడు సినిమాలో శివ బాలాజీ పక్కన నటించింది.పెద్ద వంశి దర్శకత్వంలో వచ్చిన “ఫాషన్ డిజైనర్ సన్ ఆఫ్ లేడీస్ టేలర్” సినిమాలోనూ నటించగా… తాజాగా సోషల్ మీడియాలో ఈ భామ చేసిన కామెంట్లు హల్ చల్ చేస్తున్నాయి. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న రియాలిటీ షో “బిగ్ బాస్” ప్రారంభమైన సంగతి మనకు తెలిసిందే. ఈకార్యక్రమాన్ని చూసిన తరువాత మానస స్పందిస్తూ “ఈ ప్రోగ్రాం చెత్తగా వుంది. నేను ఈ ప్రోగ్రాం చేయనందుకు చాలా చాలా సంతోష పడుతున్నా” అంటూ ట్వీట్ చేసింది.మానస కామెంట్లకు నొచ్చుకున్న ఎన్టీఆర్ అభిమానులు ఆమెపై విరుచుకుపడగా ఈ అంశంపై మరోసారి స్పందించిన ఈ భామ కార్యక్రమాన్ని మాత్రమే తాను తప్పు పట్టాను గానీ … హోస్ట్ చేస్తున్న ఎన్టీఆర్ ని ఎక్కడ కామెంట్ చేయలేదనే విషయాన్నీ గ్రహించాలని ఎన్టీఆర్ అభిమానులకు సూచించింది. షో ప్రారంభంలోనే వివాదాలు చుట్టుముట్టుతున్న ఈ షో రానున్న రోజుల్లో మరిన్ని వివాదాలకు కేంద్రబిందువు అవుతుందోమో!.

Comments

comments

Share this post

scroll to top