మనం రోజు చేసే ఈ 8 పనులు వీలైనంత తొందరగా మానేయండి..! లేదంటే ఎలాంటి ప్రమాదం ఉందో తెలుసా.?

కొందరికి నిద్ర లేచి లేవగానే బెడ్ కూడా దిగకుండా కాఫీ తాగే అలవాటుంటుంది..దానికి బెడ్ కాఫి అని ఒక పేరు కూడాను..మరికొందరికి సినిమా చూసేప్పుడు పాప్కార్న్ నములుకుంటూ చూడకపోతే అసలు సినిమానే ఎక్కదు..ఇలాంటి అలవాట్లు మనమీద ఎంతటి దుష్ఫ్రభావాన్ని చూపుతాయో మనకు తెలీదు.ఇదే విషయాన్ని చెప్పే ప్రయత్నం చేశారు  లండన్ యూనివర్శిటికి చెందిన ఫిలిప్ఫా లాల్లీ మరియు ఆమె సహచరులు. సాధారణంగా మనకు ఒక అలవాటు ఏర్పడడానికి ఇరవై ఒక రోజులు పడుతుందట.అదే అలవాటుని వదిలించుకోవడానికి మాత్రం చాలా సమయమే పడుతుంది..ఫిలిప్పా లాల్లి చేసిన పరిశోధనల ప్రకారం మన రోజువారి అలవాట్లు ఎంత ప్రమాదకరమైనవో తెలిసినది.అవేంటో తెలుసుకోండి.

  • చాలా మందికి కూర్చున్నప్పుడు తమ ముందు చెయిర్ మీద కాలు పెట్టి కూర్చోవడం అలవాటు.కారు ప్రయాణాల్లో అయితే  ముందు కూర్చున్నవారు ముందున్న ప్రాంతంలో కాలు పెట్టి కూర్చుంటుంటారు..సినిమాల్లో కూడా ఇది స్టైల్ గా చూపిస్తుంటారు.కాని ఇదెంత ప్రమాదకరమో మనకు తెలీదు.ముఖ్యంగా సడన్ బ్రేక్ వేసిన సంధర్బంలో మోకాలి ప్రాంతం చిట్లే ప్రమాధం ఉంటుందట.కాబట్టి ఈ సారి కారు ప్రయాణం చేసినప్పుడు ఈ అలవాటు తగ్గించుకోండి..
  • చాలామందికి స్నానం చేశాక టవల్ ని గోడకి తగిలించే అలవాటుంటుంది.తడి టవల్స్ లో బ్యాక్టిరియా తొందరగా ఫామ్ అవుతుంది.దానివలన రకరకాల జబ్బులు కాబట్టి టవల్స్ ని యూజ్ చేయగానే ఆరేయాలి.అదే విధంగా షవర్ కర్టెన్ ని కూడా స్నానం చేసి బయటికి వచ్చేప్పుడు ఒకదగ్గరికి జరిపేస్తారు.అది అదేవిధంగా ఉండిపోతుంది .అలా ఉన్న షవర్ కర్టెన్లో కూడా ఎంతో బ్యాక్టిరియా ఫామ్ అవుతుంది.
  • ఉదయం లేవగానే బెడ్ కాఫి తాగడం చాలామందికి అలవాటు.కాని దీనివలన గుండె జబ్బులు,జీర్ణాశయ సంభందిత సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ కాబట్టి.కొన్ని వాటర్ తాగిన తర్వాత అయినా కాఫి తాగడం ఉత్తమం.
  • పాప్కార్న్ ఇష్టపడని వారుండరు.చిన్నపిల్లల నుండి పెద్దవారి వరకు అందరూ పాప్కార్న్ ని ఇష్టంగా తింటారు.ముఖ్యంగా సినిమా థియేటర్లలో సినిమా ఐపోయే లోపు పెద్ద పాప్కార్న్ డబ్బా ఖాళీ అవ్వాల్సిందే.కాని పాప్కార్న్ వలన మన పళ్లకు జరిగే నష్టం అంతా ఇంతా కాదు.మన పళ్ల సందుల్లో ఇరుక్కునే పాప్కార్న్ గురించి మనం పట్టించుకోం.దాని వలన ఒక నష్టం ఉంటే ఇరుక్కున పాప్కార్న్ తీయడానికి మనం వాడే పద్దతుల వలన మరొక నష్టం ఉంటుంది.ముఖ్యంగా చాలామంది పుల్లలు,పిన్నీసులు పెట్టి తీయడానికి ప్రయత్నిస్తుంటారు. దీనివలన పళ్లు డ్యామేజ్ అవుతాయి.
  • ముఖంపైన పింపుల్స్ ని గిల్లే అలవాటు చాలా మందికి ఉంటుంది..అదే చేత్తో ముఖంపై ముట్టుకొవడం వలన లేదంటే ఆ మొటిమనుండి వచ్చే రసాలు చర్మంపై వ్యాప్తి చెందడం వలన బ్యాక్టిరియా వ్యాపించి మరిన్ని ముటిమలు వచ్చే అవకాశం ఉంటుంది.కావున మొటిమను గిల్లకుండా ఉండడమే మంచిది.
  • ఏదన్నా ఎగ్జిబిషన్ కి వెళ్లినప్పుడు మనం కెమెరాలో ఫోటోస్ తీయడానికి ప్రయత్నిస్తుంటాం.కాని అది మంచి పద్దతి కాదు.దానివలన మన దృష్టి ఫోటో తీయడంపై ఉంటుంది తప్ప అక్కడ విషయాల్ని గమనించేదానిపై ఉండదు.దీనివలన కొన్నిసార్లు చాలా ముఖ్యమైన విషయాలను కూడా మిస్ అవుతుంటాం.
  • చాలామంది చార్జింగ్ పెట్టి మొబైల్స్ ని దిండు కింద పెడుతుంటారు.మనం ఎప్పుడూ వింటూ ఉంటాం ఛార్జింగ్ పెట్టి ఫోన్ మాట్లాడితే పేలతాయి అనేది..అదేవిధంగా ఛార్జింగ్ పెట్టి దిండు కింద పెట్టినా ఈ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.కాబట్టి ఇకపైన అలా చేయకండి.
  • కార్లలో ప్రయాణించేప్పుడు వాటర్ బాటిల్ తప్పనిసరి..కాని అదే కార్లో నిండుగా ఉన్న బాటిల్ వదిలేస్తే ప్రమాదం కూడా తప్పనిసరి.మనం కార్లో బాటిల్ వదిలేసి,అన్ని డోర్స్ క్లోజ్ చేసేస్తాం.అలా  కార్లో బాటిల్ మర్చిపోయినట్టైతే ఆ బాటిల్లో ఉన్న నీరు లెన్స్ లా పనిచేసి సూర్యకాంతికి ప్రభావితమై మంటని పుట్టిస్తుందట..దానివలన పెద్ద ప్రమాదమే సంభవించవచ్చు. కాబట్టి ఇకముందు కార్లో బాటిల్ వదిలేయకండి..

Comments

comments

Share this post

scroll to top