ఆ మెసేజీలు ఎక్కువ పంపడం వల్ల…ఇండియాలో వాట్సాప్ ఆగిపోనుంది అంట.? ఎందుకో తెలుసా.?

ఉదయం నిద్రలేవగానే నేటి తరుణంలో చాలా మంది చేస్తున్న మొదటి పని.. వాట్సాప్‌, ఫేస్‌బుక్‌ మెసెంజర్‌ వంటి యాప్ లలో తమకు వచ్చిన మెసేజ్‌లు అన్నింటినీ ఒక సారి చెక్‌ చేసుకుని ఆ తరువాత అందరికీ గుడ్‌ మార్నింగ్‌ అంటూ మెసేజ్‌లు పెడతారు. ఇక కొందరు అలాంటి మెసేజ్‌లు వెదికే ఓపిక లేక వాటినే ఇతరులకు ఫార్వార్డ్ చేసి తాము క్రియేట్‌ చేసినట్టు బిల్డప్‌ ఇస్తారు. ఇక కొందరైతే గుడ్‌ మార్నింగ్‌ మెసేజ్‌లను చూసి సైలెంట్‌గా ఉంటారు. కొందరు వాటిని అసలు ఓపెన్‌ చేయరు. అయితే మీకు తెలుసా..? నిజానికి ఉదయాన్నే యూజర్లు పెట్టే ఈ గుడ్‌ మార్నింగ్‌ మెసేజ్‌ల వల్ల ఫేస్‌బుక్‌ మెసెంజర్‌ ఏమో గానీ వాట్సాప్‌ మాత్రం స్లోగా పనిచేస్తుందట. అవును, మీరు విన్నది నిజమే.

మనం నిత్యం ఉదయం లేవగానే సూర్యున్నో, పిట్టనో, పువ్వులనో వాట్సాప్‌లో పంపుతాం. దానికి తోడు గుడ్‌ మార్నింగ్‌ అంటూ ఓ సందేశం పంపుతాం. అయితే ఇలా మన దేశంలో ఉన్న వాట్సాప్‌ యూజర్లు చాలా మంది ఉదయాన్నే ఒకేసారి గుడ్‌ మార్నింగ్‌ మెసేజ్‌లను పంపుకుంటుండడం వల్ల వాట్సాప్‌ హ్యాంగ్‌ అవుతుందట. కొన్ని చోట్ల వాట్సాప్‌ ఆ సమయంలో పనిచేయడం లేదట. అలా అని సాక్షాత్తూ వాట్సాప్‌ ప్రతినిధులే చెబుతున్నారు. ఉదయాన్నే ఇండియన్స్‌ పంపుకుంటున్న వాట్సాప్‌ గుడ్‌ మార్నింగ్‌ మెసేజ్‌ల వల్ల వాట్సాప్‌ స్టక్‌ అవుతుందని అంటున్నారు.

అయితే ఇలా గుడ్‌ మార్నింగ్‌ మెసేజ్‌లు పంపడం వల్ల కేవలం వాట్సాప్‌ స్టక్‌ అయి ఆగిపోవడమే కాదు, అలా మెసేజ్‌లను రిసీవ్‌ చేసుకునే యూజర్ల ఆండ్రాయిడ్‌ ఫోన్లు హ్యాంగ్‌ అవుతున్నాయట. ఎందుకంటే రోజూ కుప్పలు కుప్పలుగా వచ్చి పడే వాట్సాప్‌ ఫొటోలు, వీడియోలు ఫోన్‌ స్టోరేజ్‌లో నిండిపోతాయి కదా. అలాంటప్పుడు ఫోన్‌ సహజంగానే స్లో అవుతుంది. దీంతో ఇలాంటి గుడ్‌ మార్నింగ్‌ మెసేజ్‌లు ఫోన్లలో నిండిపోతుండడం వల్ల ఫోన్లు కూడా స్లోగా పనిచేస్తూ ఆగిపోతున్నాయని అంటున్నారు. ఏది ఏమైనా సమస్య ఇప్పుడే ఇలా ఉంటే ముందు ముందు పరిస్థితి ఏంటో ఊహించడానికే కష్టంగా ఉంది కదా..!

Comments

comments

Share this post

scroll to top