“ఫేస్ బుక్” లో మీ ప్రొఫైల్ ఎవరు ఓపెన్ చేసారో కనిపెట్టొచ్చు..! ఎలాగో తెలుసా..? ఈ ట్రిక్ ఫాలో అవ్వండి!

ఫేస్‌బుక్‌… ఇదొక మహా సముద్రం. రోజూ మనం అందులో విహరిస్తుంటాం. కొత్త స్నేహితులను యాడ్‌ చేసుకుంటాం. కొత్త కొత్త విషయాలను తెలుసుకుంటాం. మనకు తెలిసిన విషయాలను షేర్‌ చేస్తాం. స్నేహితులతో చాట్‌ చేస్తాం. ఇలా బోలెడు పనులను మనం ఫేస్‌బుక్‌లో చక్కబెట్టుకుంటాం. అయితే ఫేస్‌బుక్‌లో మనకు ఫ్రెండ్‌ కాకపోయినప్పటికీ ఎవరి ప్రొఫైల్‌ను అయినా ఎవరైనా చూడవచ్చని మనకు తెలిసిందే. మరి ఇలాంటి పరిస్థితుల్లో అసలు ఎవరు మన ఫేస్‌బుక్‌ ప్రొఫైల్‌ను ఓపెన్‌ చేశారో తెలుసుకోవడం ఎలా ? అంటే.. అందుకు ఓ ఉపాయం ఉంది. ఏమీ లేదు.. కింద ఇచ్చిన విధంగా ఓ టిప్‌ను పాటిస్తే చాలు, దాంతో మీ ఫేస్‌బుక్‌ ప్రొఫైల్‌ను ఎవరు చూసింది ఇట్టే తెలుసుకోవచ్చు.

ఫేస్‌బుక్‌లో మన ప్రొఫైల్‌ను ఎవరు చూశారు అనేది తెలుసుకోవాలంటే ముందుగా గూగుల్‌ క్రోమ్‌ ఇంటర్నెట్‌ బ్రౌజర్‌ను కంప్యూటర్‌లో ఓపెన్‌ చేయాలి. అందులో మెనూలోకి వెళ్లి Tools అనే విభాగంలో ఉండే ఎక్స్‌టెన్షన్స్‌ అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి. అనంతరం అందులో వ‌చ్చే సెర్చ్‌లో Flatbook అనే ఎక్స్‌టెన్షన్‌ను వెదకాలి. అది కనిపిస్తుంది. దాన్ని ఓపెన్‌ చేసి ఇన్‌స్టాల్‌ చేయాలి. ఆ తరువాత గూగుల్‌ క్రోమ్‌ బ్రౌజర్‌ను క్లోజ్‌ చేసి మళ్లీ ఓపెన్‌ చేయాలి. అందులో ఫేస్‌బుక్‌ ఓపెన్‌ చేసి లాగిన్‌ అవ్వాలి.

దీంతో మీ ఫేస్‌బుక్‌ అకౌంట్‌ కొత్త థీమ్‌తో మీకు దర్శనమిస్తుంది. అప్పుడు వచ్చే విండోలో ఎడమ వైపు ఉండే భాగంలో ప్రొఫైల్‌ విజిటర్‌ అనే ఆప్షన్‌ కనిపిస్తుంది. దాన్ని ఎంచుకోవాలి. అంతే.. మీ ఫేస్‌బుక్‌ ప్రొఫైల్‌ను ఎవరెవరు విజిట్‌ చేశారు అనే విషయం మీకు తెలిసిపోతుంది. దీంతో మీ అకౌంట్‌ సేఫ్టీగా ఉంటుంది. ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు మీ ఫేస్‌బుక్‌ ప్రొఫైల్‌ను విజిట్‌ చేసి ఉంటే వెంటనే వారిని బ్లాక్‌ చేయవచ్చు..!

 

Comments

comments

Share this post

scroll to top