మ‌న జీవితం అంతా 0 నుంచి 9 వ‌ర‌కు ఉన్న అంకెల్లోనే ఉంది. ఎలాగో చూడండి..!

మ‌న జీవితం అంతా గ‌ణిత శాస్త్రానికి చెందిన అంకెల్లోనే ఉంది.. ఏంటీ.. న‌మ్మ‌లేరా.. అవును మేం చెబుతోంది నిజ‌మే. అంటే.. నిత్యం మనం వాడే ఫోన్ నంబ‌ర్లు, ఇంటి నంబ‌ర్లు, లెక్క‌లు, బ్యాంక్ బ్యాలెన్స్ నంబ‌ర్లు.. ఇవి కాదు లెండి. 0 నుంచి 9 వ‌ర‌కు ఉన్న అంకెల్లోనే మ‌న జీవితం ఉంది అని చెబుతున్నాం. ఇంకా అర్థం కాలేదా.. ఏమీ లేదండీ.. 0 నుంచి 9 వ‌ర‌కు నంబ‌ర్లు ఉన్నాయి క‌దా. అవే మ‌న నిత్య జీవితానికి చెందిన కొన్ని అంశాల‌ను ప్ర‌తిబింబిస్తాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

9 – రోజూ 9 గ్లాసుల వ‌ర‌కు నీటిని తాగాలి. క‌రెక్టే క‌దా. 9 గ్లాసులు అంటే.. దాదాపుగా 2 లీట‌ర్ల నీరు అన్న‌మాట‌. క‌రెక్టే క‌దా.

8 – నిత్యం మ‌నం 8 గంట‌ల పాటు నిద్ర పోవాలి. అంద‌రికీ ఈ స‌మ‌యం వర్తిస్తుంది. నిద్ర త‌క్కువ‌గా పోతే ఎలాంటి అనారోగ్యాలు వ‌స్తాయో తెలుసు క‌దా. అందుకే 8 గంట‌ల పాటు అంద‌రూ నిద్రించాలి.

7- ప్ర‌పంచంలో ఉన్న 7 వింత‌ల‌ను కుటుంబ స‌భ్యుల‌తో క‌ల‌సి చుట్టి రావ‌డం. అంత‌క‌న్నా ఎవ‌రికైనా ద‌క్కే అదృష్టం ఇంకేముంటుంది చెప్పండి.

6 – ఆరు అంకెల్లో ఆదాయం ఆర్జించ‌డం. జీవితంలో ఇంక ఇంత‌కు మించి ఎవ‌రికీ ఏమీ అవ‌స‌రం ఉండ‌దు క‌దా.

5 – వారంలో కేవ‌లం 5 రోజుల పాటు మాత్ర‌మే చేసే ప‌ని దొర‌క‌డం.

4 – ఫోర్ వీల‌ర్ కొనాల‌ని అంద‌రికీ ఉంటుంది. కానీ కొంద‌రు మాత్ర‌మే ఆ క‌ల‌ను సాకారం చేసుకుంటారు. అలా క‌ల‌ను సాకారం చేసుకున్న వారు అదృష్ట‌వంతులు.

3 – ట్రిపుల్ బెడ్ రూం హౌస్ ప్ర‌తి వ్య‌క్తి క‌నే క‌ల‌. కొంద‌రు మాత్ర‌మే దాన్ని సాధిస్తారు.

2 – మేమిద్దరం.. మాకిద్ద‌రు.. అన్న‌ట్లుగా దంప‌తుల‌కు ఇద్ద‌రు పిల్ల‌లు ఉంటే చాలు. అదే పెద్ద పండుగ‌.

1 – స్పందించే హృద‌యం ఒక్క‌టి ఉన్నా చాలు. స‌మాజం బాగు ప‌డుతుంది.

0 – ఒత్తిడి, ఆందోళ‌న స్థాయి సున్నా లెవ‌ల్‌లో ఉండాలి. అప్పుడే మ‌నిషికి ప్ర‌శాంతత ల‌భిస్తుంది.

Comments

comments

Share this post

scroll to top