మన దేవుళ్ళకు ఇష్టమైన వంటకాలు.!

చాలావరకు దేవుళ్ళకు నైవేద్యం గా వేటిని పెట్టాలో భక్తులకు తెలియదు. మన  దేవీదేవతలకు ఎటువంటి వంటకాలంటే ఇష్టమో తెలియక తమకు నచ్చిన పదార్థాలను నైవేద్యంగా పెడుతుంటారు. గణేశుడికి నైవేద్యంగా లడ్డులు లేదా మోధఖ్ (కుడుము) లను పూజలో పెడతారు. అలాగే పరమశివుడిని పూజిస్తూ భంగు, ఉమ్మెత్త పువ్వు, కుంకుమ పువ్వుతో చేసిన పదార్థాలను ఆ స్వామివారి ముందు ఉంచుతారు. ఇక అల్లరి కృష్ణయ్య శ్రీకృష్ణుడికి వెన్నతో చేసిన వంటకాలన్నా, తెల్లటి వెన్న, పాలతో చేసిన తియ్యటి పదార్థాలన్నా చాలా ఇష్టమట. పురణాల ప్రకారం  మన దేవుళ్ళకు ఎటువంటి పదార్థాలు ఇష్టమో, ఏ పిండివంటలను ఇష్టంగా భుజిస్తారో  తెలుసుకుందాం.

శివుడు:
పరమశివుడికి పాలతో చేసిన పదార్థాలను ఎంతో ప్రేమగా స్వీకరిస్తాడు.ఇంకా కుంకుమపువ్వుని కలిపి చేసిన ఆహారపదార్థాలు, తియ్యటి వంటకాలన్న ఆయన ఇష్టపడతాడు. అయితే కొంతమంది భంగు, పెరుగుతో చేసిన ఆహార పదార్థాలను శివుడికి నైవేద్యంగా ఉంచుతారు. పాలతో తయారుచేసిన పదార్థాలంటే శివుడికి చాలా ఇష్టం.
2_1453555375
నారాయణుడు:
నారాయణుడు,శ్రీకృష్ణ పరమాత్ముడు, రాముడు ఇలా అవతరాలు వేరైనా ఆయనలీలలు మాత్రం ఒక్కటే కదా. మహావిష్ణువుకు పసుపు కాయ ధాన్యాలంటే ఎంతో ఇష్టంగా స్వీకరిస్తాడట. ఇంకా వీటికి కొంచెం బెల్లంకలిపి చేసిన వంటకాలైతే ఇక చెప్పనక్కర్లేదు. అందుకే విష్ణుమూర్తిని భక్తిశ్రద్ధలతో పూజించేటప్పుడు పసుపు వర్ణంగల లడ్డులను ఆయనకు నైవేద్యంగా పెడతారు.
3_1453555376
శ్రీకృష్ణుడు
శ్రీకృష్ణుడుకి  బాల్యంలోనే వెన్నదొంగగా పేరుంది. వెన్న అంటే అంత ఇష్టం. పక్క ఇళ్ళలో ఉన్న వెన్నను దొంగిలించి మరీ తినేవాడట. అందులో తెల్లటి వెన్నంటే ఆయనకు మహా ప్రీతి. అందులో చక్కర  కలుపుకొని ఆరగించేవాడట. ఇంకా కొబ్బరితో చేసిన లడ్డూలన్నా శ్రీకృష్ణుడికి ఇష్టమట. ఆయనను పూజించే సమయంలో ఈ వంటకాలనే ఆయన ముందు ఉంచుతారు భక్తులు.
hqdefault
వినాయకుడు:
బొజ్జగణపయ్య వినాయకుడికి లడ్డూలు, కుడుములన్నా మహా ప్రీతి.విఘ్నేశ్వరుడిని పూజించే సమయంలో ఆయనకు నైవేద్యంగా ఆ పదార్థాలనే ఉంచుతారు.
4_1453555376
 హనుమంతుడు:
హనుమంతుడికి ఎర్రటి ధాన్యాలను ఇష్టంగా స్వీకరిస్తాడు. ఎర్రటి కందిబెడలను నీటిలో తడిపి వాటిని బెల్లంతో కలిపి స్వామివారి ముందు నైవేద్యంగా పెట్టి పూజ చేస్తే మనకు కోరికలను తీరుస్తాడట.
5_1453555376
శనిదేవుడు:
శనిదేవుడికి నలుపు వర్ణం అంటే ఇష్టం. నల్లని నువ్వులతో చేసిన వంటకాలను శనిదేవుడు ఎంతో ఇష్టంగా స్వీకరిస్తాడు.అలాగే ఆవాల నూనెతో చేసిన వంటకాలను శనిదేవుడి పూజలో ఉపయోగిస్తారు.
6_1453555376
లక్ష్మిదేవి:
అష్టైశ్వర్యాలను, ఆరోగ్యాన్ని ప్రసాదించే లక్ష్మిదేవికి వరిధాన్యంతో చేసిన పదార్థాలను పూజలో పెడతారు. బియ్యంతో చేసిన ఖీర్ ను లక్ష్మిదేవి ఇష్టంగా స్వీకరిస్తారు.
7_1453555377
సరస్వతి:
చదువుల తల్లి సరస్వతిని పూజించే సమయంలో, మంచి బుద్ధి, చదువు ప్రసాదించాలని ఖిచిడీని నైవేద్యంగా ఉంచుతారు.
8_1453555377
దుర్గ:
ప్రపంచాన్ని రక్షిస్తున్న, శివుడు భార్య అయిన దుర్గామాతను పూజించడానికి కిచిడీ లేదా తియ్యటి ఖీర్ ను పూజకు ఉపయోగిస్తారు. దుర్గాదేవికి ఆ పదార్థాలంటే ఇష్టమట.
9_1453555377
కాళికామాత:
ధైర్యం,బలాన్నిచ్చే కాళికామాత బియ్యంతో చేసిన ఆహార పదార్థాలను ఇష్టంగా స్వీకరిస్తారు.బియ్యంతో చేసిన తియ్యటి పదార్థాలు, కూరగాయలు,ఖీర్ కాళికా పూజలో ఆ తల్లి ముందు పెడతారు. ఏ వంటకాలైన సరే వరిధాన్యంతో చేసినవి అయితే ఇష్టంగా భుజిస్తారట అమ్మవారు.
10_1453555378

Comments

comments

Share this post

scroll to top