అతని బ్యాంకు అకౌంట్ లో డబ్బులు లేవు…కానీ ఏటిఎం నుండి ఏకంగా 22 లక్షలు డ్రా చేసాడు! ఎలాగో తెలుసా?

ఒక పక్క మనం ఎటిఎం లో డబ్బులు డ్రా చేయడానికి ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటే. ఢిల్లీ కి చెందిన ఒకతను మాత్రం చాలా సులభంగా 21 లక్షలు డ్రా చేసాడు. పైగా అతని అకౌంట్ లోనుండి డబ్బులు కూడా కట్ అవ్వలేదు. ఇదేంటి ఆశ్చర్యంగా ఉంది అనుకుంటున్నారా? అతను ఏం చేసాడో చూడండి!

ఢిల్లీ లోని “రాజౌరి గార్డెన్” వద్ద ఎటిఎం లో “దినేష్” అనే 30 ఏళ్ళ ఎంబీఏ విద్యార్ధి ఒక చిన్న ట్రిక్ వాడి ఏకంగా 22  లక్షలు withdraw చేసి చివరికి ఫ్రాడ్ కేసులో పోలీసులకు చిక్కాడు. మొత్తంగ 10 బ్యాంకుల్లో 232 ట్రాన్సక్షన్స్ చేసి 22 లక్షలు కొట్టేసాడు!

అతను ట్రాన్సాక్షన్ చేసిన ప్రతిసారి “కాష్ షట్టర్” ను మధ్యలో ఆపేసేవాడు. అది ఎలాగ అంటే. withdraw చేసిన ప్రతి సరి బయటకి వచ్చిన డబ్బులలోనుండి పైన, కింద ఉండే చివరి రెండు నోట్లు వదిలేసి మిగిలింది బయటకి తీసేసుకునేవాడు. చివరి రెండు నోట్లు అలాగే ఉండటం వల్ల కాష్ షట్టర్ క్లోజ్ అయ్యేది కాదు. ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయ్యింది అని చూపించేది. అకౌంట్ లోనుండి డబ్బులు కూడా కట్ అయ్యేవి కావు. అలా ఎన్నో సార్లు చేసి 22 లక్షలు దోచేశాడు. చివరికి యూనియన్ బ్యాంకు వాళ్ళు ఏదో తప్పు జరుగుతుందని గమనించి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో. పోలీసులు ఇన్వెస్టిగేట్ చేసి, సి సి కెమెరాల ఆధారంగా దినేష్ ను అరెస్ట్ చేసారు.

 

Comments

comments

Share this post

scroll to top