భ‌వ‌నంపై నుంచి దూకి వివాహిత ఆత్మ‌హ‌త్య‌… భ‌ర్త చిత్ర‌హింస‌లే కార‌ణం..!

మ‌న దేశంలో మ‌హిళ‌ల‌కు అనుకూలంగా ఎన్ని చ‌ట్టాలు ఉన్నా, ఎన్ని కొత్త చ‌ట్టాలు తెచ్చినా… వారిపై మృగాళ్ల దాడులు ఆగ‌డం లేదు, స‌రిక‌దా ఇంకా ఎక్కువ అవుతున్నాయి. మ‌గాళ్లమ‌నే అహంకారంతో కొంద‌రు వ్య‌క్తులు మ‌హిళ‌ల ప‌ట్ల దారుణంగా ప్ర‌వ‌ర్తిస్తున్నారు. చిత్ర‌హింస‌ల‌కు గురి చేస్తున్నారు. దీంతో అభం శుభం తెలియ‌ని మ‌హిళ‌లు బ‌ల‌వ‌న్మ‌ర‌ణాల‌కు పాల్ప‌డుతున్నారు. క్ష‌ణికావేశంలో ఆత్మ‌హ‌త్య‌లు చేసుకుని నిండైన జీవితానికి మ‌ధ్య‌లోనే ఫుల్‌స్టాప్ పెడుతున్నారు. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ల‌క్నోలో ఇటీవ‌లే జ‌రిగిన ఓ సంఘ‌ట‌న స‌రిగ్గా ఇదే కోవ‌కు చెందుతుంది. కెరీర్‌పై ఎన్నో ఆశ‌లు, జీవితంలో సాధించాల‌నుకునే ఉన్న‌త ల‌క్ష్యం పెట్టుకుని ఎంతో ఆశ‌గా అత్తింట్లో అడుగు పెట్టిన ఆ యువ‌తి చివ‌ర‌కు ఆత్మ‌హ‌త్య చేసుకుని తిరిగి రాని లోకాల‌కు వెళ్లిపోయింది. అందుకు కార‌ణం ఆమె భ‌ర్తే..!

wife-dead-1

ఆమె పేరు న‌మ్ర‌తా ప‌స్వాన్‌. ఈమెకు ల‌క్నోకు చెందిన దీప్ ర‌త‌న్ అనే వ్య‌క్తికి గ‌త కొంత కాలం కింద‌ట వివాహం జ‌రిగింది. అయితే దీప్ ర‌త‌న్ మొద‌ట న‌మ్ర‌తా అక్క‌ను పెళ్లి చూపులు చూశాడు. కానీ అత‌ని దృష్టి న‌మ్ర‌తాపై ప‌డింది. కానీ పెద్ద‌మ్మాయికి పెళ్లి కాకుండా చిన్న‌మ్మాయికి పెళ్లి చేసేందుకు ఆమె త‌ల్లిదండ్రులు ఒప్పుకోలేదు. అయితే దీప్ ర‌త‌న్ త‌ల్లిదండ్రులు బ‌తిమాల‌డంతో చివ‌ర‌కు న‌మ్ర‌తా ప‌స్వాన్‌కు, అతనికి వివాహం అయింది. అయితే న‌మ్ర‌తా అప్ప‌టికే ఐఏఎస్‌కు ప్రిపేర్ అవుతోంది. ఎలాగైనా సివిల్స్ ర్యాంక్ సాధించి ఐఏఎస్ ఆఫీస‌ర్ కావాల‌ని ఆమె ల‌క్ష్యం. పెళ్లికి ముందు త‌న ల‌క్ష్యాన్ని అత్తింటి వారికి, ముఖ్యంగా భ‌ర్త‌కు విడ‌మ‌రిచి చెప్పింది. అందుకు వారు స‌రే అన్నారు. పెళ్ల‌య్యాక చ‌దువుకోవ‌చ్చ‌ని చెప్పారు. కానీ వివాహం అయ్యాక న‌మ్ర‌తా ప‌రిస్థితి మారింది.

wife-dead-2

నిత్యం ఆమెను భ‌ర్త దీప్ ర‌త‌న్ కొట్టేవాడు. చిత్ర హింస‌ల‌కు గురి చేసేవాడు. వీపుపై కాలితో త‌న్నేవాడు. న‌మ్ర‌తా పీరియ‌డ్స్ లో ఉండ‌గా ఏకంగా ఆమె క‌డుపుపైనే కాలితో త‌న్నేవాడు. అయితే ఆ హింస అంత‌టినీ న‌మ్ర‌తా భ‌రించింది. ఎప్ప‌టికైనా భ‌ర్త మార‌తాడ‌ని ఆశించింది. అయితే అత‌నిలో మార్పు రాలేదు. పైగా రోజు రోజుకు అత‌ను శాడిస్ట్ అయిపోసాగాడు. ఈ క్రమంలోనే ఫిబ్ర‌వ‌రి 16వ తేదీన న‌మ్ర‌తాకు దీప్ ర‌త‌న్‌కు మ‌ళ్లీ ఎప్ప‌టిలాగే గొడ‌వ జరిగింది. అది తారా స్థాయికి వెళ్లింది. దీంతో తీవ్ర మ‌న‌స్థాపానికి లోనైన న‌మ్ర‌తా (28) తాము ఉంటున్న అపార్ట్‌మెంట్ పైకి ఎక్కి 14వ అంత‌స్తు నుంచి కింద‌కు దూకి ఆత్మ‌హ‌త్య చేసుకుంది. అలా ఆమె త‌న నిండైన జీవితాన్ని మ‌ధ్య‌లోనే వ‌దిలి వెళ్లింది. ఈ క్ర‌మంలో దీప్ ర‌త‌న్‌ను పోలీసులు అరెస్టు చేశారు కూడా. అయినా పోయిన న‌మ్ర‌తా ప్రాణాలు తిరిగి రావు క‌దా..! ఇక దీప్ ర‌త‌న్ లాంటి ప్ర‌బుద్ధుల‌కు బుద్ధి ఎప్పుడు వ‌స్తుందో ఆ దేవుడికే తెలియాలి..!

Comments

comments

Share this post

scroll to top