మానవత్వమా..నువ్వెక్కడ?? వాటర్ బాటిల్ లోని నీళ్లు తాగినందుకు రైలు కిటికీలకు కట్టేసి చితక్కొట్టారు.

భిన్న మతాలు, సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలకు వేదిక భారత్. అందుకే మన దేశాన్ని భిన్నత్వంలో ఏకత్వం ఉన్న దేశం అని కూడా అంటారు. విదేశీయులు సైతం అబ్బురపోయే సంస్కృతి మనది. ఇతరులకు సేవ చేయడంలో, మానవతా దృక్పథాన్ని కలిగి ఉండడంలో మనకు మనమే సాటి అని గొప్పలు కూడా చెప్పుకుంటాం. అయితే మధ్యప్రదేశ్‌లో జరిగిన ఓ సంఘటన మాత్రం మన మానవీయతను ప్రశ్నిస్తోంది. వివరాల్లోకి వెళితే…
ఇటీవల మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇటార్సీ రైల్వే స్టేషన్‌లో ఓ యువకుడు దాహం అవుతుండడంతో తోటి ప్రయాణికుల వాటర్ బాటిల్ తీసుకుని అందులోని నీరు తాగాడు. అయితే ఇది చూసిన ఆ ప్రయాణికులు ఒక్కసారిగా కోపోద్రిక్తులయ్యారు. మనుషులమన్న విచక్షణ మరిచిపోయారు. దారుణంగా ప్రవర్తించారు. తమ నీటిని తాగాడన్న నెపంతో ఆ యువకుడ్ని వారు రైలు కిటికీలకు అతని ప్యాంట్‌తోనే కట్టి వేశారు.
అలా కట్టివేసిన తరువాత కొంత సేపటి వరకు అతన్ని చితకబాదారు. దీంతో ఆ యువకుడు ఒకానొక క్రమంలో పట్టు సడలి కిందకి వేలాడాడు. అయినప్పటికీ ఆ ప్రయాణికులు అతన్ని విడిచిపెట్టలేదు. మరింతగా రెచ్చిపోయారు. అయితే ఇంత తంతు జరుగుతున్నా అక్కడ ఆ దృశ్యాలను వీక్షించేవారు తప్ప ఆ యువకున్ని కాపాడేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ఈ సంఘటననంతా ఓ వ్యక్తి తన ఫోన్‌లో చిత్రీకరించడంతో ఆ ఘటన గురించి తాజాగా సమాచారం వెలుగులోకి వచ్చింది. ఆ యువకున్ని చితకబాదిన పలువురు ప్రయాణికులను వారు ప్రస్తుతం అదుపులోకి తీసుకున్నారు. కానీ ఎంతైనా ఇలాంటి సంఘటనలను మాత్రం అస్సలు ఉపేక్షించకూడదు.
ఇటార్సీ రైల్వేస్టేషన్‌లో యువకున్ని చితకబాదిన వీడియోను కింద వీక్షించవచ్చు.
Watch Video:

Comments

comments

Share this post

scroll to top