భార్య చిన్ననాటి ఫొటోలో భర్త అనుకోకుండా పడ్డాడు. అప్పుడు ఒకరికరు తెలియదు.. షాకింగ్‌..!

మనలో ఎవరికైనా నిత్య జీవితంలో అప్పుడప్పుడు కొన్ని సంఘటనలు యాదృచ్ఛికంగా జరుగుతుంటాయి. కొన్ని అనుకోకుండా జరుగుతాయి. అలాంటి వాటిలో కొన్ని ఘటనలు మనకు నిజంగా ఒక్కోసారి ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఇప్పుడు మేం చెప్పబోతున్నది కూడా సరిగ్గా ఇలాంటి ఆశ్చర్యాన్ని కలిగించే ఘటనే. దీన్ని కో ఇన్సిడెన్స్‌ అని కూడా అంటారు. ఇలాంటివి ఎప్పుడో గానీ జరగవు. జరిగితే మనకు ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని పంచుతాయి. షాక్‌ను కలిగిస్తాయి. సరిగ్గా ఆ లవర్స్‌కు కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. ఇంతకీ వారు ఎవరంటే…

వారి పేర్లు వెరోనా కొలికి, మిరాండ్‌ బుజాకు. వీరిద్దరూ ఈ మధ్యే పెళ్లి చేసుకున్నారు. అయితే అంతకు ముందు నుంచే ఒక సంవత్సరం పాటు ప్రేమించుకున్నారు కూడా. అందులో భాగంగానే వారు పెళ్లి చేసుకున్నారు. అయితే ఇక్కడే ఓ చిత్రం జరిగింది. అదేమిటంటే.. వెరోనా చిన్నప్పుడు ఓ బీచ్‌లో తన కుటుంబంలోని తోటి పిల్లలతో కలిసి ఫొటో దిగింది. ఆ ఫొటోలో మిరాండ్‌ బుజాకు కూడా ఉన్నాడు. అయితే అప్పుడు అతను పిల్లాడే. వెరోనా వెనుక సముద్రంపై టబ్‌ మీద తేలుతున్నాడు. మరి ఈ విషయం వారికి ఎలా తెలిసిందంటే..

వెరోనా కజిన్‌ ఒకరు ఈ పాత ఫొటోను ఆమెకు ఇవ్వగా ఆమె దాన్ని తన లవర్‌ అయిన మిరాండ్‌ కు చూపించింది. దీంతో మిరాండ్‌ షాకయ్యాడు. ఆ ఫొటోలో తాను ఉన్నానని తెలుసుకున్నాడు. కానీ అప్పుడు వెరోనా, మిరాండ్‌ ఒకరికొకరు తెలియదు. వెరోనా లాగే మిరాండ్‌ కూడా తన కుటుంబ సభ్యులతో బీచ్‌ కు వచ్చాడు. అప్పుడు ఇద్దరూ పిల్లలే. ఆ క్రమంలో వెరోనా తీయించుకున్న ఫొటోలో అనుకోకుండా వెనుక మిరాండ్‌ పడ్డాడు. అయితే ఇప్పుడు ఆ ఫొటోను చూపగానే మిరాండ్‌ గుర్తు పట్టాడు. దీంతో వారిద్దరికీ కలిగిన ఆనందం అంతా ఇంతా కాదు. ఒకప్పుడు తాము తీసుకున్న ఫొటోలో తమకు తెలియకుండానే ఇద్దరూ పడడం, వారు అప్పుడు ఒకరికొకరు తెలియకపోవడం, అనంతరం పెద్దయ్యాక ఇప్పుడు ఇద్దరూ ప్రేమించుకోవడం, పెళ్లి చేసుకోవడం… ఇలా జరిగిన ఘటనలను ఒకేసారి చూస్తే అప్పుడు వారికే కాదు, నిజంగా ఎవరికైనా ఆశ్చర్యంగానే అనిపిస్తుంది. అయితే ఇప్పుడీ జంట ఫొటోలు ఒక్కసారిగా నెట్‌లో వైరల్‌ అవుతున్నాయి. వీటికి నెటిజన్లు రక రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా వారిద్దరూ ఇలా కలుసుకోవడం, ఒక్కటవ్వడం ఆశ్చర్యంగానే ఉంది కదా..!

 

Comments

comments

Share this post

scroll to top