మహిళను అత్యాచారం చేయబోతుంటే అడ్డుకున్నాడు, పోరాడాడు, ప్రాణాలు వదిలాడు.రియల్ హీరో.

అతని పేరు జాన్సన్… వృత్తి పెయింటర్…. రోజూలాగే తన పని అయిపోయాక బైక్ మీద ఇంటికి వెళుతున్నాడు. సమయం రాత్రి 9 అవుతుంది. అంతా నిశ్శబ్దంగా ఉంది. తను ఇంటికి వెళ్ళాలంటే  పలవరం( తమిళనాడు)  రైల్వేస్టేషన్ ను మీదుగా వెళ్ళాలి… అలాగే వెళుతున్నాడు.. ఒక్కసారిగా రైల్వేస్టేషన్ నుండి  ఓ మహిళ  రక్షించండీ, రక్షించండీ అనే  అరుపులు వినిపిస్తున్నాయ్.

వెంటనే బైక్ పక్కన ఆపి జాన్సన్ ఆ రైల్వేస్టేషన్ లోపలికి వెళ్ళాడు. ఆ రైల్వే స్టేషన్ ఓ మూలన ఓ మాతృమూర్తి తన ఒడిలోని చంటిపిల్లకు పాలు పట్టిస్తుంది. అమె మీదే ఓ నలుగురు యువకులు తాగిన మైకంలో అత్యాచారానికి ప్రయత్నిస్తున్నారు. వాళ్ళ నుండి తన మాన, ప్రాణాలను రక్షించుకోడానికి ఆమె ఇంకా అలాగే కేకలు వేస్తుంది. ఈ దృశ్యాలు చూసిన జాన్సన్ గుండె రగిలిపోయింది,  ఆవేశం కట్టలు తెంచుకుంది. ఆ స్థితిలో ఉన్న మహిళలో తన చెల్లి కనిపించింది అతనికి..

వెంటనే  నలుగురి దగ్గరికి వెళ్ళి వారించే ప్రయత్నం చేశాడు, అయినా ఆ రాక్షసులు వినిపించుకోలేదు. అప్పటి వరకు బతిమిలాడిన జాన్సన్ …. ఆ నలుగురి లో ఒకడిని కొట్టాడు..దీంతో కోపోద్రిక్తులైన మిగిలిన ముగ్గురు యువకులు…జాన్సన్ మీద దాడి చేస్తున్నారు. ఇంతలో జాన్సన్ తన చేతులతో ఆ మహిళను పారిపోమ్మని సైగ చేశాడు.దీంతో ఆ మహిళ అక్కడి నుండి పారిపోయింది. మద్యం మత్తులో ఉన్న ఆ నలుగురు కత్తులతో జాన్సన్ మీద దాడి చేశారు. కత్తిపోట్లకు జాన్సన్ అక్కడే  రక్తపు మడుగులో పడిపోయాడు. చనిపోయాడు.

palavaram

జాన్సన్ నీ సాహాసానికి లేదు మరణం… ఆపదలో ఉన్న మహిళను చెల్లిగా భావించి నువ్వు చేసిన సాహాసం మరవదు ఈ భారతం. జోహార్ జాన్సన్ జోహార్.. నీ ఆత్మకు శాంతి కలగాలని… నీ సుగుణాలు మాకు రావాలని ఆ భగవంతుడిని మనసారా ప్రార్థిస్తున్నాము.

 

Fore More Updates: Ap2tg.com

Comments

comments

Share this post

One Reply to “మహిళను అత్యాచారం చేయబోతుంటే అడ్డుకున్నాడు, పోరాడాడు, ప్రాణాలు వదిలాడు.రియల్ హీరో.”

  1. E V MaheswaraReddy says:

    Janson You are Really Great Person. Nivu Yekkada Vunna Ni Atma Santhosanga Vundalani. Nivu Malli Twaraga Janmichalani Korukunta Mitrama JOHN Son

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top