ఫేమస్ అవ్వాలని షిప్ లో 11 వ అంతస్థు నుండి దూకిన మహానుభావుడు, తరువాత ఎం జరిగింది అంటే??

ఈ మధ్య కాలం లో ఫేమస్ అవ్వాలని వింత వింత పద్ధతుల్లో ప్రయత్నాలు చేస్తున్నారు యువత, సోషల్ మీడియా పుణ్యమా అంటూ ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయిపోవచ్చు. ఒక్క సారి ఒక వీడియో వైరల్ అయ్యింది అంటే, అది మన దేశం లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ఆ వీడియో ని చూస్తారు, ఆ వీడియో లో వ్యక్తి పాపులర్ అవుతాడు, పాపులర్ అవ్వడానికి ప్రాణాలు సైతం లెక్క చెయ్యట్లేదు కొంతమంది, ఆ కోవకి చెందిన వాళ్లలో నయదేవ్ ఒకడు.

అ ఆ అమెరికా.. :

అమెరికా కు చెందిన నయదేవ్ అనే వ్యక్తి రాయల్ కరేబియాన్ షిప్ పైనుండి దూరాడు, ఈ షిప్ ప్రపంచం లోనే అతి పెద్ద షిప్, ఈ షిప్ లో 11 వ అంతస్థు నుండి దూకాడు ఇతగాడు, అలాగని ఇతనికేమి బాధలు, కష్టాలు లేవు. ఇన్స్టాగ్రామ్ లో ఫేమస్ అవ్వాలనే ఇతను షిప్ లో 11 వ అంతస్థు నుండి దూకాడు, అతను దూకినప్పుడు అతని ఫ్రెండ్స్ అతని వీడియో ని రికార్డు చేసారు, ఆ వీడియో ఇన్స్టాగ్రామ్ లో వైరల్ అయ్యింది.

ఇకపైన ఎక్కకు.. :

రాయల్ కరేబియాన్ షిప్ మ్యానేజ్మెంట్ నయదేవ్ మరియు అతని ఫ్రెండ్స్ పైన సీరియస్ అయ్యారు, ఇకపైన ఎప్పటికి మీరు మా షిప్ ఎక్కలేరు, మిమ్మల్ని ఎక్కించుకోము అని తేల్చి చెప్పారు, నయదేవ్ కి ఏమైనా అయి ఉంటే వాళ్ళ షిప్ రెపుటేషన్ డ్యామేజ్ అయ్యేది, అతను ప్రాణాలతో బ్రతికి బయటపడటం తో ఊపిరి పీల్చుకున్నారు షిప్ యాజమాన్యం.

ఇదంతా మామూలే.. :

నయదేవ్ మీడియా తో మాట్లాడుతూ.. ‘ ఇదంతా నాకు అలవాటే, ఆ రోజు షిప్ నుండి దూకే ముందు రోజు బాగా మందు తాగాను, పొద్దున లేసిన వెంటనే వెళ్లి దూకేశా, ఆ షిప్ లో ఇంకోసారి ఎక్కాలని నాకు లేదు, మా ఫ్రెండ్స్ కి కూడా లేదు, అందుకు నాకు బాధ లేదు, ఫేమస్ అవ్వాలని చేశాను, సక్సెస్ అయ్యా’ అని నయదేవ్ తెలిపాడు.

పిచ్చి సర్..:

ఇతగాడి చేష్టలు చూసాక కొందరు నెటిజన్స్ ఇతన్ని మెచ్చుకుంటే, మరికొందరు తిట్టుకుంటున్నారు, మరీ ఇంత పిచ్చి ఉంటే బ్రతకడం కష్టం అని అతని ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లోనే కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.

instagram

Comments

comments

Share this post

scroll to top