హిప్నటిజం …. తమ మాటలతో చూపులతో ఇతరులను పూర్తిగా తమ ఆధీనంలోకి తెచ్చుకునే కళ. దీనికే వశీకరణ విద్య అని పేరు. జంతువులు మీద, పక్షుల మీద ఈ హిప్నటిజాన్ని ప్రయోగిస్తుంటారు.కానీ ఇదే హిప్నటిజాన్ని యూజ్ చేస్తూ బ్యాంక్ మేనేజర్ నుండి 93 వేలు కొట్టేశాడు హిప్నటిజంలో ఆరితేరిన వ్యక్తి. ఈ ఘటన కు సంబంధించిన వివరాలు కూడా చాలా ఆసక్తికరంగా ఉన్నాయి.
ముంబైలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాటియాలా దాదర్ బ్రాంచికి మేనేజర్ గా పని చేస్తున్న భూపేంద్ర కుమార్ మణిరామ్ (52) దగ్గరికి ఓ వ్యక్తి కస్టమర్ రూపంలో వెళ్ళాడు..తనను మహారాష్ట్ర హౌసింగ్ అండ్ డెవలెప్ మెంట్ అథారిటీ (ఎంహెచ్ఎడిఎ)లో ఆఫీసర్గా పనిచేస్తున్న శర్మగా పరిచయం చేసుకున్నాడు. వికలాంగుడైన తన సోదరుడికి బ్యాంక్ ఖాతా తీసేందుకు ఇక్కడికి వచ్చానని బ్యాంక్ మేనేజర్ ను మాటల్లోకి దించాడు. మీకు ఎంహెచ్ఎడిఎలో తక్కువ ధరకు ఫ్లాట్లు కావాలంటే చెప్పండి నేను ఇప్పిస్తానంటూ భూపేంద్ర మైండ్ సెట్ ను అటువైపుగా మార్చాడు.
తన మైండ్ పై కంట్రోల్ కోల్పోయిన భూపేంద్ర క్యాషియర్ వద్దకెళ్లి 90 వేలు తీసుకున్నాడు. తన వద్ద ఉన్న మరో 3 వేలు కలిపి మొత్తం రూ.93 వేలను శర్మ చేతిలో పెట్టి, టాటా చెప్పి పంపించాడు. కొన్ని నిమిషాల తర్వాత తేరుకున్న భూపేంద్ర.. తాను మోసపోయినట్లు తెలుసుకున్నాడు. అప్పటికే శర్మ అనే వ్యక్తి డబ్బుతో అక్కడి నుండి పరారయ్యాడు. భూపేంద్ర ఫిర్యాదు మేరకు దాదార్ పోలీసులు బ్యాంకులోని సిసి పుటేజీలను పరిశీలిస్తున్నారు. హిప్నటిజంతో డబ్బు దోచుకోవడం ఇదే మొదటిసారని పోలీసులు చెబుతున్నారు.
Watch Video:
హిప్నటైజ్ చేసిన వ్యక్తి ఊహాచిత్రం: