భార్య మీద కోపం తో విమానం హైజాక్ చేసిన వ్యక్తి, అసలేం జరిగిందంటే..!!

భార్యతో కొట్లాడితే బార్ లో కూర్చోవడమో, దేవుడి సన్నిధికి వెళ్లడమో, దోస్తులతో బైటికి వెళ్లడమో చేస్తూ ఉంటారు. కొందరు, కానీ భార్య తో మనస్పర్థలు వచ్చాయి అని విమానం నే హైజాక్ చేసాడు ఒక వ్యక్తి, ఈ సంఘటన బాంగ్లాదేశ్ లో జరిగింది, విమానం ని హైజాక్ చేసాడని తనేమి ఉగ్రవాది కాదు, కేవలం భార్య మీద ఉన్న కోపం తో విమానం ని హైజాక్ చేసాడు. వివరాల్లోకెళితే….

ఆదివారం ఢాకా నుంచి దుబాయ్‌ వెళ్తున్న బిమాన్‌ బంగ్లాదేశ్‌ ఎయిర్‌లైన్‌ విమానాన్ని మార్గమధ్యలో దారి మళ్లించేందుకు నిందితుడు యత్నించాడు. విమానం లో 148 మంది ప్రయాణికులున్నారు. ఛత్రోగ్రామ్‌ విమానాశ్రయం నుంచి విమానం బయల్దేరిన కొద్దిసేపటికే ప్రయాణికుల్లోని ఓ వ్యక్తి తన వద్ద పిస్తోలు, పేలుడు పదార్థాలు ఉన్నాయని బెదిరిస్తూ కాక్‌పిట్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించాడు. తనకు భార్యతో గొడవలున్నాయని, ఈ విషయమై బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనాతో వెంటనే మాట్లాడాలని హైజాకర్‌ పదేపదే డిమాండ్‌ చేసినట్లు ప్రయాణికులు మరియు అధికారులు వెల్లడించారు.

తిరిగి ఛత్రోగ్రామ్‌ ఎయిర్‌పోర్టులో పైలట్ లు అత్యవసరంగా ల్యాండ్ చేసారు విమానాన్ని. అక్కడ హైజాకర్‌తో ఉన్నతాధికారులు చర్చలు జరిపారు. ప్రయాణికులను విమానం నుంచి దింపేయాలని అతన్ని అడగగా అందుకు హైజాకర్‌ ఒప్పుకున్నాడు. దీంతో వారిని అత్యవసర ద్వారం నుండి బయటకు తీసుకువచ్చారు, ప్రయాణికులు సురక్షితంగా బయటికి వచ్చాక కమాండోలు రంగ ప్రవేశం చేసి లొంగిపోవాలని హైజాకర్‌ను హెచ్చరించారు.

మతిస్థిమితం.. :

కమాండోలు హెచ్చరించినా అతడు నిరాకరించడంతో అతని పైన కాల్పలు జరిపి అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ కాల్పుల్లో అతనికి తీవ్రంగా గాయాలవడం తో హైజాకర్‌ మృతి చెందాడు. హైజాకర్‌ బంగ్లాదేశ్‌కు చెందిన మహదిగా గుర్తించారు. నిందితుడు మానసిక స్థితి సరిగ్గా లేదని చర్చల సమయంలో తాము గుర్తించినట్లు అధికారులు తెలిపారు, విమానం లోకి పిస్తోలు, పేలుడు పదార్థాలు ఎలా వచ్చాయి, అతనికి ఎవరు సహకరించారు ఎలా వచ్చాయి అతని వద్దకు అవి అని అధికారులు విచారణ మొదలెట్టారు.

 

Comments

comments

Share this post

scroll to top