అత‌ను ఏ హ‌త్య చేయ‌లేదు. చేశాడ‌ని చెప్పి 10 ఏళ్ల జైలు శిక్ష వేశారు. త‌రువాత ఏమైందో తెలుసా..?

వంద మంది నేర‌స్తులు త‌ప్పించుకున్నా ఫ‌ర‌వాలేదు. కానీ ఒక్క నిర్దోషికి మాత్రం శిక్ష ప‌డ‌కూడ‌దు. ఇది మ‌న న్యాయ శాస్త్రంలో ఉంది. అయితే ఇప్పుడు చెప్ప‌బోయే ఘ‌ట‌న మాత్రం అందుకు రివ‌ర్స్ అయింది. ఇక్క‌డ వంద మంది దోషులు త‌ప్పించుకోలేదు. కానీ ఒక నిర్దోషికి మాత్రం నిజంగా శిక్ష ప‌డింది. అయితే అత‌ను త‌న‌ను తాను నిర్దోషి అని నిరూపించుకునేందుకు ఏకంగా 10 ఏళ్లు ప‌ట్టింది. దీంతో ఎట్ట‌కేల‌కు అత‌నికి న్యాయం జ‌రిగింది. ఈ క్ర‌మంలో బాధితునికి రూ.6 ల‌క్ష‌లు చెల్లించాల‌ని కోర్టు తీర్పుచెప్పింది.

అది ముంబైలోని జోగేశ్వ‌రి అనే ప్రాంతం. అక్క‌డ ఓ వ్య‌క్తి హ‌త్య జ‌రిగింది. 1996 మార్చి 14వ తేదీన ఆ ప్రాంతంలో ఓ యువ‌కున్ని ఎవ‌రో తల‌పై బండ‌రాయితో మోది హ‌త్య చేశారు. అయితే ఆ హ‌త్యానేరం పంజాబ్‌లోని లూథియానాకు చెందిన జ‌వ‌హ‌ర్ లాల్ శ‌ర్మ అనే వ్యాపార‌వేత్త‌పై ప‌డింది. అయితే అత‌ను ఉండేది లూథియానాలో. మ‌రి హ‌త్యేమో ముంబైలో జ‌రిగింది. ఈ క్ర‌మంలో శ‌ర్మ‌ను ముంబై పోలీసులు ఎలా అరెస్ట్ చేస్తారు ? అనే సందేహం అంద‌రికీ వ‌చ్చింది. అయితే ఆ హ‌త్య జ‌రిగిన ప్రాంతానికి స‌మీపంలో ఉండే ప్ర‌దేశానికి త‌ర‌చూ శ‌ర్మ వ‌చ్చి వెళ్లేవాడ‌ట‌. అదీ.. అత‌ని వ్యాపార నిమిత్తం వెళ్లేవాడు. దీంతో ఆ హ‌త్య అత‌నే చేశాడ‌ని భావిస్తూ పోలీసులు శ‌ర్మ‌ను అరెస్టు చేశారు. స్థానికంగా ఉండే ర‌యీస్ ఖాన్ (21) అనే యువ‌కున్ని శ‌ర్మ హ‌త్య చేసి చంపాడ‌ని పోలీసులు అరెస్టు చేశారు.

ఈ క్ర‌మంలో విచార‌ణ‌లో తెలిసిందేమిటంటే… అస‌లు చ‌నిపోయిన‌ ఆ యువ‌కుడు ర‌యీస్ ఖాన్ కాద‌ట‌. అత‌ను వేరే వ్య‌క్త‌ట‌. నిజంగా ర‌యీస్ ఖాన్ చ‌నిపోలేద‌ట‌. బ‌తికే ఉన్నాడ‌ట‌. అత‌ను ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో ఓ మ‌హిళ‌ను కిడ్నాప్ చేసి అజ్ఞాతంలో ఉన్న‌ట్టు గుర్తించారు. దీంతో శ‌ర్మ 2006లో కోర్టులో అప్పీల్ చేసుకోగా అత‌న్ని నిర్దోషిగా భావించి కోర్టు విడుద‌ల చేసింది. అయితే త‌న‌ను 10 ఏళ్ల పాటు క్రిమిన‌ల్‌గా కేసులో ఇరికించి, అనేక ఇబ్బందుల పాలు చేసినందుకు, శారీర‌క‌, మాన‌సిక హింస‌కు గురి చేసినందుకు, 37 సంవ‌త్స‌రాల వ‌యస్సులో వ్యాపారం చేస్తూ గౌర‌వ ప్ర‌ద‌మైన వ్య‌క్తిగా బ‌తుకుతున్న త‌నను అవ‌మాన ప‌రిచినందుకు శ‌ర్మ ముంబై హైకోర్టులో మ‌ళ్లీ అప్పీల్ చేసుకున్నాడు. దీంతో కోర్టు కేసు విచారించి ముంబై పోలీసుల‌ను మంద‌లించింది. ఆ రాష్ట్ర ప్ర‌భుత్వం రూ.6 ల‌క్ష‌ల‌ను బాధితుడు శ‌ర్మ‌కు చెల్లించాల‌ని కోర్టు తీర్పునిచ్చింది. నిజంగా ఈ విష‌యంలో శ‌ర్మ‌కు మాత్రం ఇంకా అన్యాయ‌మే జ‌రిగింద‌ని చెప్ప‌వ‌చ్చు. చేయ‌ని నేరానికి శిక్ష‌ను అనుభ‌వించడమే కాదు, 10 ఏళ్ల పాటు త‌న సంపాద‌న కోల్పోయాడు కూడా. వాటిని లెక్కిస్తే త‌న‌కు అందిన నష్ట‌ప‌రిహారం చాలా త‌క్కువనే చెప్ప‌వ‌చ్చు. ఏది ఏమైనా ఇలా మ‌రొక‌రికి జ‌ర‌గ‌కూడ‌ద‌ని ఆశిద్దాం.

Comments

comments

Share this post

scroll to top