మానవత్వాన్ని ప్రశ్నించిన ఘటన. దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయిన హైద్రాబాద్ సంఘటన!

మద్యాహ్న సమయం… సూరీడు  తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తున్నాడు. అది సికింద్రాబాద్ బోయిన్ పల్లి ప్రాంతం…తమ కార్ ను  ఢీ కొట్టాడంటూ నలుగురు యువకులు  40 యేళ్ల వ్యక్తి చేత బలవంతంగా గుంజీలు  తీయిస్తున్నారు. రోడ్డు మొత్తం రద్దీగా ఉన్నా  ఎవ్వరూ దీన్ని పట్టించుకోట్లేదు. ఓ వ్యక్తి గుంజీలు తీయడం చూస్తున్నప్పటికీ  ఎవరి పనిలో వారు ఆ….. మనకెందుకులే అని వెళుతున్నారు. పైన ఎండ 46  డిగ్రీలకు పైనా మండిపోతుంది…నడి రోడ్డు మీద ఇలా గుంజీలు తీసి తీసి అలసిపోయిన ఆ వ్యక్తి తన కార్ లో కూర్చున్న కొద్దిసేపటికే హర్ట్ ఎటాక్ తో చనిపోయాడు.

కేవలం కార్ గీసుకుపోయిందన్న కారణంతో 40 సంవత్సరాల వయసున్న వ్యక్తి చేత బలవంతంగా గుంజీలు తీయించడమే కాకుండా అతని పర్స్ ను కూడా లాగేసుకున్నారు ఆ నలుగురు యువకులు…  ఈ దృశ్యాలన్నీ సీసీ టివి కెమెరాలో రికార్డ్ అయ్యాయి. దీని ఆదారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు ముగ్గురు కుర్రాళ్లను అదుపులోకి తీసుకున్నారు. మరో వ్యక్తి కోస గాలింపు  చర్యలు చేపట్టారు.

Man-Died-Sit-Ups-750x500

 

ఇప్పుడు ఈ విషయంపై  దేశవ్యాప్తంగా పెద్ద చర్చ నడుస్తుంది. చదువుకున్న యువకులు ఇలాంటి హేయమైన చర్యకు పాల్పడడాన్ని ప్రతి ఒక్కరు ఖండిస్తున్నారు. కనీస మానవత్వం లేని పశువులు అంటూ ఆ నలుగురు కుర్రాళ్లను అభివర్ణిస్తున్నారు నెటీజన్లు.

Watch Video:

 

Comments

comments

Share this post

scroll to top