క‌న్న‌పేగు అని చూడ‌కుండా త‌ల్లిని తీవ్రంగా ర‌క్తం కారేలా కొట్టిన కొడుకు..!

దేవుడు అన్ని చోట్లా ఉండ‌డు క‌దా… అందుకే త‌న రూపంలో అమ్మ‌ను సృష్టించి మ‌న‌కు ఇచ్చాడు..! అమ్మంటే నిజంగా దైవ స్వ‌రూప‌మే. అలాంటి అమ్మ‌ను ఏ బిడ్డ‌యినా ఎలా చూసుకోవాలి..? చిన్న పిల్ల‌ల‌కు మ‌ల్లే లాలించాలి. వృద్ధాప్యంలో ఉంటే వారికి తోడు నీడ అవ్వాలి. చిన్న‌పుడు ఆమె మ‌న ప‌ట్ల ఎలా ఉండేదో… అలాగే ఆమెను వృద్ధాప్యంలో కూడా చిన్న‌పిల్ల‌లా చూసుకోవాలి. కానీ… ఆ దుర్మార్గుడికి మాత్రం త‌ల్లి అంటే ఏంటో తెలియ‌దు..! ఆమెను ఎలా చూసుకోవాలో అస్స‌లు జ్ఞానం లేదు. పైగా… డ‌బ్బుల కోసం చిత‌క‌బాదాడు. ర‌క్తం వ‌స్తున్నా ఆగ‌లేదు. క‌న్న‌బిడ్డే క‌న్న‌పేగును హింసిస్తుంటే… ఆ త‌ల్లి మౌనంగా భ‌రించింది తప్ప ఎదురు తిర‌గ‌లేదు. అయినా ఆ విచ‌క్ష‌ణా జ్ఞానం లేని మ‌నిషి రూపంలో ఉన్న‌ జంతువు ఆగ‌లేదు… త‌ల్లిని చిత్ర‌హింసలు పెట్టి పెట్టి చివ‌ర‌కు వెళ్లిపోయాడు. అదీ… ఆ త‌ల్లికి నెల నెలా ఇంటి అద్దె రూపంలో వ‌చ్చే ఆ కొద్దిపాటి సంపాద‌న‌ను లాక్కుని మ‌రీ… ఆ ప్ర‌బుద్దుడు పారిపోయాడు… హృద‌య విదార‌క‌మైన ఈ సంఘ‌ట‌న దేశ రాజ‌ధాని ఢిల్లీలో జ‌రిగింది..!

rajindri-devi

ఢిల్లీలోని షాహాద‌ర ప్రాంతానికి చెందిన ర‌జింద్రీ దేవికి వ‌య‌స్సు 70 ఏళ్లు. భ‌ర్త లేడు. ఉన్న ఒక్క‌గానొక్క ఇంట్లో కొంత పోర్షన్ అద్దెకు ఇచ్చి, దాని ద్వారా వ‌చ్చే సంపాద‌న‌తోనే పాపం ఆ త‌ల్లి జీవితం వెళ్ల‌దీస్తోంది. అయితే ఆమెకు ఆ చిన్న‌పాటి సంపాద‌న‌ను కూడా మిగ‌ల్చ‌డం లేదు ఆమె కొడుకు. అత‌ని పేరు నంద్ కిషోర్‌. నెల నెలా వ‌చ్చి త‌ల్లి ద‌గ్గ‌ర ఉన్న డ‌బ్బులు కూడా లాక్కుని వెళ్తుంటాడు. ఈ క్ర‌మంలోనే ఇప్పుడు కూడా ఆమె ద‌గ్గ‌ర‌కు వ‌చ్చాడు. అయితే ర‌జింద్రీ దేవి డ‌బ్బులు ఇవ్వ‌లేదు. దీంతో ఆమెను చిత్ర హింస‌ల‌కు గురి చేశాడు నంద్‌ కిషోర్. 70 ఏళ్ల వృద్ధురాలు అని కూడా చూడ‌కుండా, పేగు తెంచి జ‌న్మ‌నిచ్చిన త‌ల్లి అన్న మ‌మకారం ఏమాత్ర‌మైనా లేకుండా, ఓ మ‌హిళ… అందులోనూ చేయూత లేని ఓ వృద్ధురాలు అనే మాన‌వత్వం లేకుండా అత‌ను ప‌శువులా ఆమె మీద ప‌డి గాయాలకు గురి చేశాడు. ఓ ద‌శ‌లో ఆమెకు తీవ్ర ర‌క్త‌స్రావం కూడా అయింది. అయినా ఆ ప్ర‌బుద్ధుడు వ‌దల్లేదు. ఆమెను ఇంకా కొట్టి ఆమె ద‌గ్గ‌ర ఉన్న డ‌బ్బును లాక్కుని వెళ్లిపోయాడు. పోతూ పోతూ ఆమెను న‌డిరోడ్డు మీద ప‌డేశాడు. దీంతో ఆమెను గ‌మ‌నించిన స్థానికులు ర‌క్షించి ఆస్ప‌త్రిలో చేర్పించారు.

అయితే ర‌జింద్రీ దేవి నడిరోడ్డుపై ప‌డి ఉన్నప్పుడు ఆమెను ఓ వ్య‌క్తి వీడియో తీశాడు. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడిలో హాట్ టాపిక్‌గా మారింది. త‌ల్లిని అంత‌టి హింస‌కు గురి చేసిన ఆమె కొడుకు నంద్ కిషోర్‌పై నెటిజన్లు తీవ్ర‌స్థాయిలో మండిప‌డుతున్నారు. అలాంటి వ్య‌క్తిని అస్స‌లు విడిచిపెట్ట‌కూడ‌ద‌ని, క‌చ్చితంగా ఉరి తీయాల‌ని డిమాండ్ చేస్తున్నారు. అయితే ప్ర‌స్తుతానికి నంద్ కిషోర్‌ను పోలీసులు అరెస్టు చేసి తీహార్ జైలుకు పంపారు. ఏది ఏమైనా, నంద్ కిషోర్ లాంటి న‌ర రూపంలో ఉన్న ప‌శువుల‌ను మాత్రం అస్స‌లు వ‌ద‌ల‌కూడ‌దు..!

Comments

comments

Share this post

scroll to top