మానవత్వమా నువ్వెక్కడా…? అని ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఏర్పడింది ఈ ఘటన తర్వాత..! సొంత మరదలిపైనే పాశవిక దాడి చేసిన ఆ వ్యక్తిని చూశాక..! చిత్తూరు జిల్లాలో జరిగిన ఈ ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. పొలానికి నీళ్లు మళ్లించే విషయంలో తమ్ముడి భార్యతో గొడవపడిన నాగభూషణం అనే వ్యక్తి సహనం కోల్పోయి ఆమెను కాలితో తన్ని, ఆమె పై పిడిగుద్దులు గుద్దాడు.
చిత్తూరు జిల్లాలోని కొత్తవారి పల్లి గ్రామంలో నాగభూషణానికి, అతడి తమ్ముడు శ్రీనివాస్ కు వారసత్వంగా తండ్రి నుండి వచ్చిన భూమి ఉంది. పంపకాల్లో భాగంగా ఇద్దరు పొలాలు పక్కపక్కనే ఉన్నాయ్.. దీంతో నీళ్లు మళ్లింపు విషయంలో తరచూ గొడవలు జరిగేవి. ఈ రోజు కూడా అదే గొడవ జరిగింది. ఆ సమయంలో శ్రీనివాస్ లేడు..అతని భార్య మాత్రమే ఉంది.
మొదట మాట మాట పెరిగింది. దీంతో సహనం కోల్పోయిన నాగభూషణం మహిళపై పాశవిక దాడికి దిగాడు. విచక్షణరహితంగా కొట్టాడు. అక్కడే ఉన్న కొడుకు దీన్నంతా సెల్ ఫోన్ ద్వారా వీడియో తీసి పోలీసులకు పిర్యాాదు చేశారు.
Watch Video Here: