“అరుంధతి” సినిమాలో “అనుష్క” ప్లేస్ లో ఎవరిని అనుకున్నారో తెలుసా.? ఆమె ఎందుకు వదులుకుంది.?

అరుంధతి..అనుష్క కెరీర్లోనే కాదు,తెలుగు సినిమా చరిత్రలో ఇప్పటికి టాప్ మూవీస్ లో ఒకటిగా నిలిచిపోయే సినిమా..అనుష్క దశ తిరిగింది ఈ సినిమాతోనే అని చెప్పొచ్చు.అరుంధతి తర్వాతే  హీరోలతో సమానంగా తనకు  పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో నటించి ఇప్పటికి టాప్ పోజిషన్ ని పదిలంగా కాపాడుకుంటుంది.అరుంధతి రిలీజై ఇప్పటికి పదేళ్లు కాబోతుంది..ఇప్పటికి సినిమా పట్ల,స్వీటి పట్ల క్రేజ్ మాత్రం తగ్గలేదు.అప్పట్లో ఆ ఛాన్స్ ఎందుకు మిస్ చేసుకున్నానా అని బాధ పడుతుంది ముద్దుగుమ్మ మమతా మోహన్ దాస్..

మమతామోహన్ దాస్ ఒక వైపు హీరోయిన్ గా,మరోవైపు సింగర్ గా అప్పట్లో బానే గుర్తింపు తెచ్చుకుంది..తర్వాత క్యాన్సర్ భారిన పడడంతో సినిమాలకు దూరమయ్యి,క్యాన్సర్ తో ఫైట్ చేసి విజయం సాధించింది.మమతామోహన్ దాస్ కెరీర్‌ ఇప్పుడు దాదాపు ముగిసిపోయినట్లు కనిపిస్తోంది..కానీ కెరీర్ మొదట్లో చేసిన తప్పు వలన ఇప్పుడు బాదపడుతుంది ఈ అమ్మడు.. ముఖ్యంగా.. అనుష్కకి స్టార్ డమ్‌ని తీసుకొచ్చిన ‘అరుంధతి’ సినిమాని అప్పట్లో వదులుకుని పెద్ద తప్పిదం చేశానని చెప్తోందట.కోడి రామకృష్ణ దర్శకత్వంలో.. శ్యామ్‌ప్రసాద్ రెడ్డి నిర్మించిన ‘అరుంధతి’ సినిమా 2009లో విడుదలై సంచలన విజయం సాధించింది. దీంతో ఆ సినిమా టైటిల్ రోల్ చేసిన అనుష్క.. సౌత్‌లో టాప్ హీరోయిన్‌ జాబితాలో చేరిపోయింది. అనుష్క పాత్ర కోసం తొలుత మమతామోహన్ దాస్‌నే చిత్ర యూనిట్ సంప్రదించిందట.. అయితే.. కథ విన్న తర్వాత ఆ సినిమా హిట్ అవదేమో..? అని తాను వదులుకున్నట్లు ఈ అమ్మడు తెగ బాధపడిపోతూ చెప్తోంది.

‘కెరీర్ ఆరంభంలో నాలుగైదేళ్లు నాకు చాలా గందరగోళంగా ఉండేది. ఏది మంచి పాత్రో నేను గుర్తించలేకపోయాను. ఈ క్రమంలోనే అరుంధతి సినిమాని వదలేసుకున్నాను. ఆ తర్వాత క్యాన్సర్ బారిన పడటం.. చివరికి కెరీర్ సంగతి దేవుడెరుగు.. కనీసం బతికితే చాలనుకున్నా’ అని ఈ మధ్య మీడియా ముందు చెప్పుకొచ్చింది మమతా..అంతే కదా ప్రాణం కంటే విలువైంది ఏముంటుంది..అయినా మనం ప్లాప్ అనుకున్నది సూపర్ హిట్ అవ్వడం,హిట్ అనుకున్నది ప్లాప్ అవ్వడం సినిమావాళ్లకు కొత్తేం కాదు..అవకాశం వదులుకున్నాక బాదపడిన ప్రయోజనం ఉండదు.

Comments

comments

Share this post

scroll to top