మామ మంచు-అల్లుడు కంచు…సినిమా రివ్యూ &రేటింగ్

  • mama-manchu-alludu-kanchu-theatr-640x360
  • నటీనటులు:మోహన్ బాబు, రమ్యకృష్ణ,మీనా, అల్లరినరేష్,పూర్ణ, అలీ, వరుణ్ సందేశ్
  • దర్శకత్వం:  శ్రీనివాస రెడ్డి
  • సంగీతం: అచ్చు, కోటి, రఘుకుంచె
  • నిర్మాత:మంచు విష్ణు

Story:

ఇద్దరి పెళ్ళాల మధ్య ముద్దుల మొగుడు. మధ్యలో అల్లరి అల్లుడు. సింపుల్ గా చెప్పలంటే ఇదే ఈ సినిమా. భక్తవత్సలం నాయుడు (మోహన్ బాబు). అనుకోని పరిస్థుతుల్లో ఒకరికి తెలియ కుండా సూర్యకాంతం (మీనా), ప్రియవంద(రమ్యకృష్ణ)లను పెళ్లి చేసుకొని, 25 ఏళ్ళుగా మేనేజ్ చేస్తుంటాడు. సూర్యకాంతం కూతురు శృతి (పూర్ణ), ప్రియంవద కొడుకు గౌతమ్ (వరుణ్ సందేశ్). సూర్యకాంతం, ప్రియంవద ల మ్యాటర్ తెలీకుండా భక్తవత్సలంకు సహాయం చేస్తుంటాడు ఇస్మాయిల్ అలీ. ఒకరోజు గౌతమ్, శృతిలు కలుస్తుండగా,వారిద్దరూ కలిస్తే అసలు నిజం బయటపడుతుందేమోనని బాలరాజు (అల్లరి నరేష్)ని రంగంలోకి దింపుతాడు భక్తవత్సలం. అయితే మొదటిచూపులోనే శృతిని చూసి ఫ్లాట్ అయిన బాలరాజు ఆమెను ప్రేమిస్తాడు. ఎలాగైనా బాలరాజు,తన కూతరు నుండి విడగొట్టాలని ఎన్నో ఇస్మాయిల్ తో  భక్తవత్సలం ఎత్తులు వేస్తుంటాడు. ఇంతలో బాలరాజుకి భక్తవత్సలం అసలు నిజం తెలిసి, భక్తవత్సలంను ఎలా ఆటపట్టించాడు? ప్రేమించిన శృతిని బాలరాజు ఎలా దక్కించుకున్నాడు? భక్తవత్సలం ఇద్దరు పెళ్ళాల విషయం సూర్యకాంతం, ప్రియంవదలకు తెలిసిందా?లేదా? అనేది మిగతా స్టోరీ.

 

PLUS POINTS:

  • మోహన్ బాబు, అల్లరినరేష్ ల మధ్య వచ్చే సీన్స్
  • స్క్రీన్ ప్లే
  • సినిమాటోగ్రఫీ

 

MINUS POINTS:

  • సాంగ్స్
  • కథ,కథనం

Verdict: ఎంటర్ టైన్ చేయలేకపోయిన మామ-అల్లుడు

Rating: 2/5

Trailer:

Comments

comments

Share this post

scroll to top