రేపిస్ట్ ల‌పై మండిప‌డ్డ హీరోయిన్…బాత్ రూమ్ కు వెళ్లినా తొంగిచూస్తుంటే మేం ఎం చేయాలి? అంటూ భావోద్వేగంతో రాసిన పోస్ట్ ఇది.

బాలీవుడ న‌టి మలైకా ఆరోరా ..లైంగిక దాడులు చేసే వారిపై మండిప‌డ్డారు. బెంగుళూరు ఘ‌ట‌న త‌ర్వాత ఆడ‌వాళ్ల మీద ఎక్క‌డెక్క‌డ ఏ రూపంలో లైంగిక దాడులు జ‌రుగుతున్నాయో, వాట‌న్నింటిని క‌వ‌ర్ చేస్తూ…. ద‌ర్శ‌న్ అనే వ్య‌క్తి రాసిన పోస్ట్ ను త‌న ఇన్ట్సాగ్రామ్ లో షేర్ చేశారు. ఇది కాస్త సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యింది.

మ‌లైకా షేర్ చేసిన మెసేజ్ య‌దాత‌థంగా తెలుగులో…

పార్టీ చేసుకుందామని నా ఫ్రెండ్స్‌ తో కలిసి వెళ్లా.నాగ‌రిక స‌మాజంలో జీవించే ఎంతో మంది ఉన్నారక్కడ. మమ్మల్ని చూడగానే మీదపడ్డారు.. ఒంటిని తడుముతూ, వేసుకున్న బ‌ట్ట‌ల్ని చించేశారు. నన్ను నేను కాపాడుకోవడం కోసం నేన‌క్క‌డి పారిపోయా.

ఈసారి బహిరంగ ప్రదేశాలు వద్దనుకుని బౌన్సర్లు ఉండే ఓ పబ్‌కు వెళ్లాం. అనూహ్యంగా.. ‘ఆ పర్సన్స్‌’ అక్కడికి కూడా వచ్చారు. మా వీపులపై, వీపు కింది భాగాలపై దెబ్బలు కొట్టారు. మళ్లీ నేన‌క్క‌డి నుండి పరుగెత్తా. మగవాళ్ల తోడుంటే భద్రంగా ఉండొచ్చని నా ఫ్రెండ్‌ని వెంటబెట్టుకుని సినిమాకి వెళ్లా. బస్సులో తిరిగి వస్తుండగా ‘వాళ్లు’ మళ్లీ కనిపించారు. ఈసారి పదునైన ఇనుప చువ్వలను నాలోపలికి దించారు!

కొద్దిగా బుద్ది తెచ్చుకుని, ఒళ్లు కనిపించకుండా క‌ప్పిఉంచే సల్వార్‌ కమీజ్‌లో కాలేజీకి వెళ్లానా.. వాళ్లు అక్కడికీ తగలబడ్డారు! నన్ను చుట్టుముట్టి ఒంటిని తడిమారు. నా ర‌క్ష‌ణ‌కి నేనే బాధ్యురాల‌ని కాబట్టి ఇంటికి పారిపోయా! ఎట్టిపరిస్థితుల్లోనూ బయటికి వెళ్లకూడదని డిసైడై ఇంట్లోనే ఉండిపోయా. ఈ సారి వాళ్లు మా బంధువుల రూపంలో మీదపడ్డారు. బెడ్‌మీద పడేసి రకరకాలుగా హింసించారు. ఇంత జరిగినా నన్ను.. నేను తప్ప ఇంకెవ్వరూ కాపాడరు!

చివరికి బాత్‌రూమ్‌లోకి వెళ్లినా.. సందుల్లో నుంచి ‘వాళ్లు’ తొంగిచూస్తున్నారు. ఎం చెయ్యాలి? నా సేఫ్టీ నాకు ముఖ్యం కాబట్టి స్నానం చెయ్యడం మానేశా..! ఆ రకంగా నన్ను ఎక్కడ ఉంచాలని వాళ్లు అనుకున్నారో, నేను అక్కడే ఉండిపోయా. తిరిగి కోలుకోలేని విధంగా నా స్ఫూర్తిని దెబ్బతీశారు. వాళ్ల దయతో నేనింకా బాత్‌రూమ్‌లోనే ఉండిపోయా..

నేనెవరో మీకు తెలుసు కదా? బాత్‌రూమ్‌ నుంచి బయటికి వస్తే.. దేశం కోసం మెడల్స్‌ సాధించగల భారతీయ అమ్మాయిని. మగవాళ్లతో సమానంగా సైన్యంలో చేరగల ధీరవ‌నిత‌ని. అంతరీక్షంలోకి వెళ్లగల వ్యోమగామిని. టాప్‌మోస్ట్‌ కంపెనీలకు సీఈవో కాగల సమర్థురాలిని. కానీ నాకు నా సేఫ్టీ ముఖ్యం. నా అనుమానం ఏంటంటే.. అమ్మాయిలు మోడ్రన్ బట్టలు వేసుకోవడం పాశ్చాత్య సంస్కృతి అయితే, వాళ్లపై అబ్బాయిలు లైంగికదాడులు చేయడం భారతీయ సంస్కృతా?

Comments

comments

Share this post

scroll to top