సినీనటి రంజని మరణం.!

ప్రముఖ మలయాళ నటి కల్పనా రంజని (51) సోమవారం ఉదయం హైదరాబాద్ లోని అపోలో హాస్పిటల్ లో చికిత్స పొందుతూ కన్నుమూశారు. వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో తెలుగు, తమిళ భాషల్లో నాగార్జున-కార్తీ నటిస్తున్న ‘ఊపిరి’ సినిమా షూటింగ్ లో పాల్గొనేందుకు కేరళ నుండి హైదరాబాద్ వచ్చిన ఈమె, ఓ హాటల్ గదిలో బసచేస్తుండగా, అపస్మారక స్థితిలో ఉన్న కల్పనను హోటల్ సిబ్బంది అపోల్ హాస్పిటల్ కు తరలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్లుగా వైద్యులు తెలిపారు. గుండెపోటుతో మరణించినట్లుగా సమాచారం.
ప్రముఖ నటి ఊర్వశి సోదరి అయిన కల్పనా రంజని 1977లో ‘విదారునే మొత్తుకుల్’ చిత్రంతో బాలనటిగా మలయాళ సినిమాతో పరిచయమయ్యారు. 1983లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మల్లువుడ్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన కల్పనా తెలుగు, తమిళ, మలయాళ భాషలలో దాదాపు 300పైగా చిత్రాలలో నటించారు. తెలుగులో వెంకటేష్ నటించిన ‘ప్రేమ’, ‘సతీలీలావతి’,’బ్రహ్మచారి’, తమిళ్ లో ‘ఖాకి సత్తై’,’ఇదియ తురుడ’, మలయాళంలో ‘ఎన్నుం ఎప్పోజం’,’కార్నవార్’,’డాల్ఫిన్స్’,’బెంగళూర్ డేస్’ వంటి సూపర్ హిట్ సినిమాలలో చెప్పుకోదగ్గ పాత్రలో మంచి నటన కనబరిచారు.
కల్పనా నటించిన చివరి చిత్రం మార్టిన్ ప్రక్కట్ డైరెక్షన్ లో మలయాళంలో తెరకెక్కిన ‘చార్లీ’. 2012లో ‘తనిచల్లా న్యాన్’ చిత్రానికి గానూ ఉత్తమ సహాయనటిగా జాతీయ అవార్డును కల్పనా రంజిత్ అందుకున్నారు. మలయాళ చిత్ర దర్శకుడు అనిల్ ను వివాహమాడిన కల్పనా రంజిత్, 2012 నుండి ఆయనతో విడిపోయి తన కూతురు శ్రీమయితో కేరళలో  ఉంటున్నారు. కేరళ నుండి హైదరాబాద్ బయలుదేరిన శ్రీమయి, కల్పనా రంజిత్ భౌతికకాయాన్ని కేరళ తీసుకెళ్లనున్నారు. కల్పనా రంజిత్ అంత్యక్రియలు కేరళలో జరగనున్నాయి.

Comments

comments

Share this post

scroll to top