మొట్టమొదటిసారి వివాదంలోకి “నమ్రత”..! “నమ్రతకి” పొగరెక్కువ అని కామెంట్ చేసిన హీరోయిన్ ఎవరంటే.?

నమ్రతా శిరోద్కర్ పేరుకి తగ్గట్టుగానే ఎంతో వినమ్రతతో ఉంటుందనేదే మనందరికి తెలుసు..ఇప్పటివరకూ నమ్రత గురించి ఎలాంటి విమర్శలు వినపడలేదు..ఏ వివాదంలోనూ నమ్రత ఇరుక్కోలేదు..పెళ్లి తర్వాత తన కెరీర్ కు గుడ్ బై చెప్పి పూర్తిగా కుటుంబ బాద్యతలకే పరిమితమైన నమ్రత అంటే అందరికి ఒక రకమైన గౌరవభావం .అటువంటిది నమ్రత గురించి మలైకా అరోరా చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.

మిస్ ఇండియా కిరీటాన్ని గెలుచుకున్న నమ్రతా శిరోద్కర్..ఒకప్పుడు టాప్ మోడల్..హీరోయిన్.మహేశ్ తో చేసిన తొలి చిత్ర పరిచయం తోనే ఇద్దరి మధ్య ప్రేమ పుట్టి అది పెళ్లికి దారితీసింది… పెళ్లి అయిన తర్వాత మోడలింగ్, నటనకు స్వస్తి పలికి ఇంటికే పరిమితమయ్యారు, మహేష్, తమ పిల్లలు గౌతమ్, సితార బాగోగులు చూసేందుకు సమయాన్ని కేటాయించింది. అంతేకాదు సేవ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ అందరితో అభినందనలు అందుకుంటోంది. అటువంటి నమ్రతపై బాలీవుడ్ నటి మలైకా అరోరా  నమ్రతకి చాలా పొగరని మీడియాలో చెప్పింది.

బాలీవుడ్ నటి నేహా ధూపియా నిర్వహిస్తున్న ‘వోగ్ బీఎఫ్ఎఫ్’ కార్యక్రమంలో పాల్గొన్న మలైకా మోడలింగ్ రంగంలో ఉన్నప్పుడు తనకు ఎదురైన అనుభవాలను షేర్ చేసుకుంది. “నేను మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టే సమయానికి నమ్రత, మెహర్ జెస్సియాలు టాప్ మోడల్స్ గా ఉన్నారు. దీంతో, జూనియర్ అయిన నా పట్ల వారు చాలా దురుసుగా ప్రవర్తించారు” అని వెల్లడించింది. అయితే కొన్ని రోజులకి నమ్రత, మెహర్ జెస్సియాలను తాను అర్ధం చేసుకున్నానని, అప్పటి నుంచి ఇప్పటివరకు స్నేహన్ని కొనసాగిస్తున్నామని వివరించింది.

Comments

comments

Share this post

scroll to top