బాహుబలి "ధీవరా" సాంగ్ మేకింగ్. (Video)

బాహుబలి సినిమా చూశారా? చూశేవుంటారు లెండి… ఎందుకంటే   ఎక్కువ మంది చూసిన సినిమాగా అది పెద్ద రికార్డ్ నే సెట్ చేసి పెట్టింది మరి. బాహుబలి సినిమాలో ధీవరా సాంగ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.. ఆ జలపాతం. ప్రభాస్ చేసే స్టంట్లు.. అబ్బో ఆ పాట మొత్తం కనురెప్ప  వాల్చకండా చూసేదిగా ఉంటుంది.  ఆ సాంగ్ ను చూశాక  కెమెరామాన్ ని, స్టంట్ మాస్టర్ని, డైరెక్టర్  ని వాట్ ఏ టేకింగ్ సార్ అనకుండా మాత్రం ఉండలేము.

పాట స్టార్టింగ్ లో తమన్నా కొండ వైపు ప్రభాస్ దూకే సీన్, అక్కడి నుండి జారి పడే సీన్, తర్వాత చెట్టు ఊడలలో చిక్కుకునే సీన్, ఆ తర్వాత చెట్టు ఊడలనే బాణపు వింటినారి లా చేసి చెట్టుకు బాణం వేసే సీన్….. ఒక్కొక్క సీన్  బాహుబలి టీమ్ కష్టాన్ని చూపించింది. మరి  ఇందులో మీకే సీన్ నచ్చిందో చెప్పండి!

తాజాగా బాహుబలి లో ధీవరా సాంగ్ కు సంబంధించిన మేకింగ్ వీడియోను ఆఫీషియల్ గా విడుదల చేశారు. ఆ వీడియో చూస్తే ఔరా అనిపించక మానదు. ఆ జలపాతాలెక్కడా…? ఆ ఊడలేవి, ఆ కొండలేవి అని ఆశ్చర్యపోతారు. నేనే కంగుతిన్న ఈ మేకింగ్ వీడియో చూసి.. ఏయ్ రాజమౌళి మొత్తానికి మరోసారి గ్రాఫిక్స్ కింగ్ అనిపించుకున్నావ్ పో…. అర చేతిలో స్వర్గం అంటారే అచ్చంగా అదే చూపించావ్…. Hats Off The Great Director.

Watch Here  Making Of  Dheevara Song From bahubali:

 

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top