గర్ల్‌ ఫ్రెండ్‌ మూడీగా ఉందా..? అయితే అబ్బాయిలు ఈ సూచనలు పాటిస్తే వారిని హ్యాపీగా ఉంచవచ్చు.

లవర్స్‌ అన్నాక అప్పుడప్పుడు వారి మధ్య చిన్నపాటి గొడవలు, మనస్ఫర్థలు వస్తూనే ఉంటాయి. ఈ క్రమంలో కొందరు అడ్జస్ట్‌ అవుతారు. మళ్లీ కలసి మెలసి ఉంటారు. కానీ కొందరు అలా అవలేరు. దూరంగా గడుపుతారు. అయితే అలా దూరమైన వారిలో అమ్మాయిల విషయానికి వస్తే వారితో అబ్బాయిలు చాలా కేర్‌ ఫుల్ గా ప్రవర్తించాల్సి ఉంటుంది. మళ్లీ తిరిగి అమ్మాయిలు హ్యాపీగా ఉండాలన్నా, యథావిధిగా వారి లవ్‌ కొనసాగాలన్నా అప్పుడు అబ్బాయిలు కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది. అవేమిటంటే…

1. గిఫ్ట్‌లకు పడిపోని వారు ఈ ప్రపంచంలో ఎవరూ ఉండరు. గర్ల్‌ ఫ్రెండ్ కు ఆమెకు సంబంధించిన అకేషన్‌ ఏమీ లేకపోయినా సరే గిఫ్ట్‌లను కొనివ్వండి. దీంతో వారు హ్యాపీగా ఫీలై అబ్బాయిలను ఎక్కువగా లవ్ చేస్తారు.

2. గర్ల్‌ ఫ్రెండ్‌ను ఆమె ఫ్రెండ్స్‌ ముందు గొప్పగా చేసి చెప్పాలి. ఆమెను వారి ఎదుట ముందు వరుసలో ఉంచాలి. ఆమె అంటే మీకు ఎంత ఇష్టమో ఆమె ఫ్రెండ్స్‌ ముందు చెప్పాలి. దీంతో అమ్మాయిలు సంతోషంగా ఫీలవుతారు.

3. గర్ల్‌ ఫ్రెండ్‌ కుటుంబ సభ్యులతో పరిచయం ఉంటే వారితో స్నేహ పూర్వకంగా మెలగాలి. వారిని కేర్‌ చేస్తున్నట్టు ఉండాలి. ఇది గర్ల్‌ ఫ్రెండ్స్‌కు నచ్చుతుంది. దీంతో వారు అబ్బాయిలను ఇంకా ఎక్కువగా ప్రేమిస్తారు.

4. అబ్బాయిలు తాము ఎక్కడికి వెళ్లినా తమ గర్ల్‌ఫ్రెండ్స్‌తో టచ్‌లో ఉండాలి. ఇలా చేస్తే తమను బాగా చూసుకుంటారనే కాన్ఫిడెన్స్‌ వారిలో బిల్డ్‌ అవుతుంది. ఫలితంగా వారు హ్యాపీగా ఉంటారు.

5. ముఖ్యమైన విషయాల్లో అబ్బాయిలు తమ గర్ల్‌ ఫ్రెండ్‌ ఒపీనియన్ అడగాలి. ఇలా చేసినా వారు హ్యాపీగా ఉంటారు.

6. ఈగోలకు పోకుండా గర్ల్‌ ఫ్రెండ్స్‌ను అబ్బాయిలు హెల్ప్‌ అడగాలి. ఇలా చేస్తే వారికి వాల్యూ ఇచ్చినట్టు ఫీలవుతారు. హ్యాపీగా ఉంటారు.

7. గర్ల్‌ఫ్రెండ్స్‌తో అబ్బాయిలు సర్దుకుపోయినట్టు ప్రవర్తించాలి. మాటి మాటికీ గొడవలు పెట్టుకునేందుకు యత్నించకూడదు. ఇలా సర్దుకుపోయినట్టు ఉంటే గర్ల్‌ ఫ్రెండ్స్‌ ఎవరికైనా బాయ్‌ ఫ్రెండ్స్‌ నచ్చుతారు. హ్యాపీగా ఉంటారు.

8. అబ్బాయిలు తమ గర్ల్‌ ఫ్రెండ్స్‌ పట్ల ప్రేమను చూపించాలి. గట్టిగా కౌగిలించుకున్నా చాలు వారు హ్యాపీగా ఫీలవుతారు.

9. గర్ల్‌ ఫ్రెండ్స్‌కు చిన్న చిన్న సమస్యలు వచ్చినా అబ్బాయిలు పట్టించుకోవాలి. వాటిని తమ కోణంలో సాల్వ్‌ చేసేందుకు యత్నించాలి. దీంతో గర్ల్‌ ఫ్రెండ్స్‌కు అబ్బాయిలపై నమ్మకం పెరుగుతుంది.

10. గర్ల్‌ ఫ్రెండ్స్‌ ను బాయ్‌ ఫ్రెండ్స్‌ ఎప్పుడూ నవ్విస్తూ సరదాగా ఉంచితే వారు హ్యాపీగా ఉంటారు.

11. లవర్స్‌ ఇద్దరిలో గర్ల్‌ ఫ్రెండ్‌ లేదా బాయ్‌ ఫ్రెండ్‌ ఎవరికి ఎవరి పట్ల అయినా సమస్య వచ్చినా ఇద్దరూ కలసి కూర్చుని చర్చించుకోవాలి. దీంతో ఎలాంటి ప్రాబ్లమ్స్‌ రాకుండా ఉంటాయి.

12. ఎక్కడ ఉన్నా ఏం చేస్తున్నా అబ్బాయిలు అమ్మాయిల పట్ల డీసెంట్‌గా ఉండాలి. దీంతో వారు హ్యాపీ మూడ్‌లో ఉంటారు.

13. రోజులో ఎప్పుడైనా (అర్థ రాత్రి కూడా కావచ్చు) సడెన్‌గా కాల్‌ చేసి ప్రేమగా మాట్లాడండి. ఇది ఆప్యాయతను పెంచి లవర్స్‌ మధ్య గుడ్‌ ఫీలింగ్‌ను కలగజేస్తుంది.

14. అబ్బాయిలు తమ గర్ల్‌ఫ్రెండ్స్‌కు దేని కోసమైనా ప్రామిస్‌ చేస్తే ఆ ప్రామిస్‌ను నిలబెట్టుకోండి. దాన్ని దాటవేయకండి.

15. కొత్త కొత్త ప్రదేశాలకు గర్ల్‌ ఫ్రెండ్స్‌ను అబ్బాయిలు తీసుకెళ్లాలి. దీంతో వారు చాలా హ్యాపీగా ఉంటారు. ఇద్దరి మధ్య ప్రేమ పెరుగుతుంది.

Comments

comments

Share this post

scroll to top