అనిల్ కుంబ్లే అనగానే గుర్తుకువచ్చే 3 సంఘటనలు.

ముందుగా టీమ్ ఇండియా క్రికెట్  కోచ్ గా ఎంపికైన కుంబ్లేకు అభినందనలు.  క్రికెట్ లెజెండ్స్ అయిన..సచిన్, ద్రావిడ్, గంగూళీ, లక్ష్మణ్ లతో కలిసి  ఆడిన అనుభవం, ఇండియన్  టెస్ట్ జట్టకు  కెప్టెన్ గా వ్యవహారించిన గతం…అన్నింటికి మించి లెగ్ స్పిన్నర్ గా గింగరాలు తిరిగే బంతులతో ప్రత్యర్థి  బ్యాట్స్ మన్ కు చుక్కలు చూపించిన నిక్కార్సైన బౌలర్ ….  ఇలా క్రికెట్ చరిత్రలో తనకంటూ కొన్ని పేజీలను రాసుకున్న వ్యక్తి   అనిల్ కుంబ్లే… నిగర్వి, వివాద రహితుడు, అన్నింటికి మించి కలుపుగోలుగా ఉండే వ్యక్తిత్వం అతని సొంతం. అలాంటి వ్యక్తి ఇండియన్ టీమ్ కు కోచ్ గా ఎంపికవ్వడం ప్రతి ఒక్కరు ఆనందించదగ్గ విషయమే….అయితే కుంబ్లే అనగానే ముఖ్యంగా మూడు సన్నివేశాలు మన కనుల ముందు కదలాడుతాయి.

అవేంటి అంటే…………….

  1. 1999, ఫిబ్రవరి 7.

చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ తో రెండవ టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది. అప్పటికే మొదటి మ్యాచ్ ఓడింది టీమ్ ఇండియా.  రెండో టెస్ట్ మ్యాచ్ లో 420 పరుగుల భారీ టార్గెట్ ను పాక్ ముందుంచింది. విజయం తథ్యం అనుకుంటున్న తరుణంలో…పాక్ ఓపెనర్లు చాలా కట్టుదిట్టంగా ఆడుతున్నారు. 100 పరుగుల వరకు ఒక్క వికెట్ కూడా కోల్పోలేదు పాక్. ఈ టెస్ట్ లో కూడా ఓటమి తప్పదేమోననే సందేహంతోనే.. కుంబ్లే చేతికి బాల్ అందించాడు టీమ్ ఇండియా కెప్టెన్….. అప్పుడు స్టార్ట్ అయ్యింది కుంబ్లే మాయాజాలం. మొదటి వికెట్ తో స్టార్ట్ అయిన అతని వికెట్ల వేట  10 వ టికెట్ పడ్డదాక ఆగలేదు. ఇలా ఓకే ఇన్నింగ్స్ లో పదికి పది వికెట్స్ ను పడగొట్టి జిమ్ లేకర్ తర్వాత స్థానంలో నిలిచాడు మన జంబో.

# తొమ్మిది వికెట్లు కుంబ్లే తీశాక.. పదవ వికెట్  కూడా అతను తీస్తే రికార్డ్ గా నిలుస్తుందని  . దీని కోసం కావాలనే  జవగళ్ శ్రీనాధ్ బౌలింగ్ మంచిగా వేయలేదనే విమర్శలు ఉన్నాయ్.

2.2002, మే 12.

క్రీజ్ లో కుంబ్లే బ్యాటింగ్ చేస్తున్నాడు.  వెస్టీండీస్ బౌలర్ థిల్లాన్ వేసిన బంతి నేరుగా హెల్మెట్ లోంచి దూరి కుంబ్లే దవడకు తగిలింది. అంతే…ఒక్కసారిగా రక్తమోడుతూ అక్కడే పడిపోయాడు కుంబ్లే. అయినా అలాగే కొద్దిసేపు బ్యాటింగ్ చేసాడు. ఇన్నింగ్స్ బ్రేక్ తర్వాత వెస్టిండీస్ బ్యాటింగ్ స్టార్ట్ అయ్యింది. కుంబ్లే కు ఆపరేషన్ చేయాలని టీమ్ ఇండియా డాక్టర్ చెప్పారు. అలాంటి సమయంలో కుంబ్లే ఈ మ్యాచ్ లో ఆడడు అనుకున్నారంతా…కానీ ఆశ్చర్యం…దవడకు కట్టుతో…..మైదానంలోకి దిగాడు జంబో….పెయిన్ కిల్లర్స్ వేసుకొని బాధను దిగమింగుతూ….బౌలింగ్ చేసి లారా వికెట్ ను పడగొట్టాడు. మ్యాచ్ గెలవలేదు, కానీ కుంబ్లే గెలిచాడు.  ఈ ఘటనతో …క్రికెట్ పట్ల అభిమానాన్ని పెంచాడు కుంబ్లే.

Kumble-broken-jaw

3.2008, జనవరి: 

అస్ట్రేలియా తో టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది. కెప్టెన్ గా అనిల్ కుంబ్లే ఉన్నాడు. గెలవాల్సిన మ్యాచ్ ను టీమ్ ఇండియా ఓడిపోయింది. ఇక్కడ ఓడిపోయింది అనడం కంటే కూడా ఉద్దేశ్యపూర్వకంగా   ఓడించబడింది అంటే బాగుంటుందేమో… అవును..ఆస్ట్రేలియా ఆటగాళ్లు, ఎంపైర్ లు కలిసి మ్యాచ్ మొత్తాన్ని కంగారులకు అనుకూలంగా చేసేశారు. వికెట్లకు దూరంగా వెళుతున్న బాల్స్ ను కూడా LBW లుగా  ఔట్ ఇచ్చిన ఉదంతాలు..ఆసీస్ ఆటగాళ్లు ఔట్ అయినా ..నో అంటూ అడ్డంగా తలూపిన ఎంపైర్స్.. ఇలా మ్యాచ్ మొత్తం అసీస్ గెలిచేలా చేశారు. పోస్ట్ మ్యాచ్ ప్రెంటేషన్ లో మాట్లాడుతూ కుంబ్లే…” ఈ మ్యాచ్ లో ఒక్క జట్టే క్రీడాస్పూర్తితో ఆడింది” అని అన్నాడు. ఈ ఒక్క మాటతో కెప్టెన్ గా కుంబ్లే స్థాయి ఎక్కడికో వెళ్లింది.

( సహాకారం: ఈనాడు దిన పత్రిక)

Watch Anil Kumble Performance:

 

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top