విడుదలైన మజిలీ టీజర్.. వెధవలకెప్పుడు మంచి పెళ్ళాలు దొరుకుతారని నువ్వు ప్రూవ్ చేసావ్.!!

అక్కినేని నాగచైతన్య, అక్కినేని సమంత జంటగా నటించిన మజిలీ సినిమా టీజర్ విడుదలయ్యింది, వీరిద్దరి వివాహం తరువాత ఇరువురు కలిసి నటించిన సినిమా ఇదే, టీజర్ చుసిన తరువాత ప్రేక్షకులకి మజిలీ సినిమా పైన అంచనాలు పెరిగాయి, అంతలా ఆకట్టుకుంది ఈ టీజర్ అందరిని.

చైతన్య బెస్ట్.. :

నాగ చైతన్య ఇప్పటికి వరకు నటించిన సినిమాల్లో మనం చిత్రం తరువాత మజిలీ చిత్రం బెస్ట్ గా నిలిచిపోతుందని అభిమానులు నమ్మకం తో ఉన్నారు. సినిమా కి హైలైట్ మాత్రం అక్కినేని సమంత నే అని టీజర్ చూస్తే అర్ధమైపోతుంది, అమాయకమైన భార్య పాత్రలో కనిపించనుంది సమంత ఈ సినిమా లో. ప్రేమలో విఫలమైన నాగచైతన్య, ఆ తరువాత సమంత ని పెళ్లి చేసుకుంటాడు, పెళ్లి అయ్యాక కూడా ప్రేమించిన అమ్మాయి ని మర్చిపోలేక సమంత ను దూరం పెడతాడు నాగ చైతన్య. సమంత చైతన్య మనసుని ఎలా మార్చగలిగింది, చైతన్య సమంత ఎలా ఒకటయ్యారు అనేదే సినిమా కథ. ఈ సినిమాలో క్రికెటర్ పాత్రలో కనిపియ్యనున్నాడు నాగ చైతన్య.

వెధవలు…

‘వెధవలకెప్పుడు మంచి పెళ్ళాలు దొరుకుతారని నువ్వు ప్రూవ్ చేసావ్’ అని టీజర్ లో పోసాని చెప్పిన డైలాగ్ కి మంచి రెస్పాన్స్ వస్తుంది నెటిజన్స్ నుండి. వాలెంటైన్స్ డే రోజు అక్కినేని అభిమానులకి నాగ చైతన్య సమంతల ద్వారా టీజర్ రూపం లో మంచి గిఫ్ట్ లభించింది. ఉగాది కానుకగా ఏప్రిల్ 5 వ తారీఖున మజిలీ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Watch Video:

 

Comments

comments

Share this post

scroll to top