మాజీ ఆర్మీ ఆఫీసర్‌ కుమార్తె రోడ్లపై బిచ్చమెత్తుకున్నారు..! ఆమె జీవితం ఎలా మారిందో తెలుసా.?

నిజంగా కొన్ని కొన్ని సార్లు కొందరి జీవితాల్లో జరిగే సంఘటనలు వారికి చేదు జ్ఞాపకాలనే మిగల్చుతాయి. దాంతో వారు చాలా కుంగిపోతారు. తీవ్రమైన మానసిక వేదనకు లోనవుతారు. ఈ క్రమంలో వారు తమ వారు దూరమైనందుకు గాను తాము కూడా అంతం అవ్వాలనే ఆలోచిస్తారు. ఆత్మహత్యలు చేసుకుంటారు. ఇక కొందరైతే తమ వారు పోయిన దుఃఖం నుంచి అంత త్వరగా బయటకు రాలేరు. దీంతో వారు మతి స్థిమితం లేని వారుగా మారుతారు. అలాంటి వారు తిరిగి మళ్లీ మామూలు మనుషులు కాలేరు. కానీ ఆమె అయింది. ఇప్పుడు తన కాళ్లపై తాను నిలబడి జీవనం సాగిస్తోంది. అంతేకాదు, తన సోదరున్ని కూడా చూసుకుంటోంది.

అతను బిపిన్‌ చంద్ర భట్‌. ఇండియన్‌ ఆర్మీలో కుమవన్‌ రెజిమెంట్‌లో మేజర్‌గా పనిచేశాడు. అనంతరం రిటైర్‌ అయ్యాడు. తరువాత ఉత్తరప్రదేశ్ లో సెక్రటేరియట్‌లోని ప్రోటోకాల్‌ డిపార్ట్‌మెంట్‌లో అండర్‌ సెక్రటరీగా పనిచేసేవాడు. అయితే ఇతను తన భార్య, ముగ్గురు పిల్లలతో కలిసి లక్నోలోని షాలిమార్‌ స్క్వేర్‌ వద్ద ఉన్న ఇందిరానగర్‌లో ఉండేవాడు. అయితే ఒకానొక సమయంలో జరిగిన యాక్సిడెంట్‌లో బిపిన్‌, అతని భార్య ఇద్దరూ మరణించారు.

అలా బిపిన్‌, అతని భార్య మరణించడంతో ఆ షాక్‌ నుంచి తేరుకోని వారి పెద్ద కుమార్తె కొన్ని రోజులకు మరణించింది. దీంతో చిన్నకుమార్తె అంజల, ఆమె తమ్ముడు ఇద్దరూ షాక్‌కు లోనూ మతిస్థిమితం కోల్పోయారు. అప్పటికే అంజల లక్నో యూనివర్సిటీలో ఎంఏ చేస్తోంది. తమ కుటుంబంలో ముగ్గురు పోయే సరికి ఆమె, ఆమె తమ్ముడు ఇద్దరూ మళ్లీ షాక్‌కు లోనయ్యారు. దీంతో వారు మతిస్థిమితం కోల్పోయారు. అప్పటి నుంచి ఇద్దరూ రహదారులపై బిచ్చమెత్తుకుంటూ బతికారు. అయితే పలువురు ఆర్మీ అధికారులు వీరిని చూసి గుర్తు పట్టి అనంతరం వీరికి ఆశ్రయం కల్పించారు. తరువాత ఇద్దరికీ హాస్పిటల్‌లో మానసిక వైద్యులచే చికిత్సను అందించారు. దీంతో ఇప్పుడు అంజల, ఆమె తమ్ముడు కోలుకున్నారు. ఇంటిని చక్కగా చూసుకుంటున్నారు. తమ పనులు తాము చేసుకుంటున్నారు. ఈ క్రమంలో అంజలకు ఆర్మీ అధికారులు ఓ క్యాంటీన్‌లో జాబ్‌ ఇప్పించగా అంజల ఆ పని కూడా చక్కగా చేసుకుంటోంది. ఏది ఏమైనా వారు మళ్లీ మామూలు మనుషులు అవడం అంటే.. అది మాటలు కాదు కదా..!

Comments

comments

Share this post

scroll to top