మైదా పిండితో త‌యారు చేసిన పరోటా, తందూరీ రోటీ, బేక‌రీ ఉత్ప‌త్తుల‌ను తింటే ప్రాణాల‌కే ముప్పు వాటిల్లుతుంద‌ట‌..!

01చపాతీ, ప‌రోటా, రోటీ, తందూరీ రోటీ, రుమాలీ రోటీ… ఇలా ఎన్నో ర‌కాల ఆహార ప‌దార్థాలు ఉన్నాయి. కానీ వాట‌న్నింటిలోనూ వాడే కామ‌న్ ప‌దార్థం ఏంటో తెలుసా? అదే గోధుమ పిండి. ఇవ‌న్నీ మ‌నం ఇంట్లో చేసుకుని తింటే ఓకే. ఎందుకంటే మ‌నం స్వ‌చ్ఛ‌మైన ప్యూర్ గోధుమ పిండితోనే ఆయా వంట‌ల‌ను చేసుకుని తింటాం కాబ‌ట్టి మ‌న ఆరోగ్యం సేఫ్‌. కానీ అవే ప‌దార్థాల‌ను బ‌య‌ట తింటే? ఇంకేముందీ రోగాల‌ను కొని తెచ్చుకున్న‌ట్టే. ఎందుకంటారా..? అయితే కింద ఇచ్చింది చ‌ద‌వండి. మీకే తెలుస్తుంది.

maida
పైన చెప్పిన ఆహార ప‌దార్థాల‌ను త‌యారు చేసేందుకు మ‌న‌మైతే ఇంట్లో దాదాపుగా కేవ‌లం గోధుమ పిండినే ఉప‌యోగిస్తాం. కానీ బ‌య‌ట మాత్రం అలా కాదు. అన్ని ర‌కాల హోటల్స్‌, రెస్టారెంట్లు, దాబాల్లో 100 శాతం మైదా పిండినే ఆ ఆహార ప‌దార్థాల కోసం వాడుతారు. అయితే అలా వారు వాడే మైదా పిండిలో మొత్తం విష‌పూరిత‌మైన ర‌సాయ‌నాలే ఉంటాయ‌ట‌. గోధుమ పిండికే Azodicarbonamide, Chlorine Gas, Benzoyl Peroxide వంటి ర‌సాయ‌నాలు క‌లిపి ఆ పిండిని తెల్ల‌గా చేస్తార‌ట‌. దీనికి తోడు మైదా పిండి మెత్త‌గా, సున్నితంగా ఉండేందుకు గాను అందులో  Alloxan అనే ర‌సాయ‌నాన్ని క‌లుపుతార‌ట‌. ఇది కూడా విష‌పూరిత‌మైన‌దేన‌ట‌. కాగా పైన చెప్పిన కెమికల్స్ అన్నింటినీ చైనా వంటి దేశాల్లో ఇప్ప‌టికే నిషేధించారు. కానీ మ‌న వ‌ద్దే వీటిని య‌థేచ్ఛ‌గా వాడుతున్నారు. ఈ క్ర‌మంలో ఆ కెమికల్స్ అన్నీ క‌లిపిన మైదా పిండి గోధుమ పిండి కంటే త‌క్కువ ధ‌ర‌కే వ‌స్తుంది. దీంతో ఆ పిండిని బేక‌రీలు, హోట‌ల్స్, రెస్టారెంట్స్ నిర్వాహ‌కులు ఎక్కువ‌గా కొనుగోలు చేసి వాడుతున్నారు. ఇలా వారు మైదా పిండిని వాడుతూ చేసిన దాదాపు అన్ని ఆహార ప‌దార్థాల‌ను మ‌నం ఎంతో ఇష్టంగా లొట్ట‌లేసుకుని మ‌రీ తింటున్నాం. కానీ వాటి వ‌ల్ల పొంచి ఉన్న అనారోగ్యాల‌ను మాత్రం మ‌నం ప‌ట్టించుకోవ‌డం లేదు.

విష‌పూరిత‌మైన కెమికల్స్ క‌లిపిన మైదా పిండితో చేసిన వంట‌ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌న శ‌రీరంలోని జీర్ణ వ్య‌వ‌స్థ అనేక ఇబ్బందుల‌కు గుర‌వుతుంది. ప్ర‌ధానంగా అలాంటి ఆహారం అస్స‌లు జీర్ణం కాదు. దీనికి తోడు ఆ పిండిలో ఉండే ప‌లు ప‌దార్థాలు పేగుల‌కు అతుక్కునిపోయి పేగుల‌కు పుళ్లు ప‌డేలా చేస్తాయి. దీంతో ఆ పుండ్లు తీవ్ర ఇన్‌ఫెక్ష‌న్లుగా మారేందుకు అవ‌కాశం ఉంటుంది. ఇలాంటి ద‌శ‌లో మ‌న ప్రాణాల‌కు ముప్పు కూడా వాటిల్లుతుంద‌ని వైద్యులు హెచ్చ‌రిస్తున్నారు. క్యాన్సర్‌, కిడ్నీ స్టోన్స్‌, గుండె జ‌బ్బులు, మ‌హిళ‌ల‌కు రొమ్ము క్యాన్స‌ర్ వంటి వ్యాధులు వ‌స్తాయ‌ట‌. దీనికి తోడు మైదా పిండిలో ఉండే పిండి ప‌దార్థం, కెమిక‌ల్స్ వ‌ల్ల ర‌క్తంలోని షుగ‌ర్ స్థాయిలు కూడా అమాంతం పెరిగిపోతాయ‌ట‌. దీంతో డ‌యాబెటిస్ వ్యాధి కూడా వ‌స్తుంద‌ట‌. ఇప్ప‌టికైనా తెలుసుకున్నారుగా! మైదా పిండి వ‌ల్ల క‌లిగే న‌ష్టాల గురించి! ఇక ముందైనా ఆ పిండితో చేసిన ప‌దార్థాల‌ను తినాలంటే ఒక‌టికి రెండు సార్లు ఆలోచించండి, వీలైతే ఈ స‌మాచారాన్ని మీ కుటుంబ స‌భ్యులు, స్నేహితులు, ఇత‌రుల‌కు తెలియ‌జేయండి. మైదాతో చేసిన ప‌దార్థాల‌ను తింటే క‌లిగే న‌ష్టాలు ఏమిటో వారికి చెప్పండి. ఎందుకంటే మ‌నకు మ‌న ఆరోగ్యం ముఖ్యం క‌దా!

Comments

comments

Share this post

scroll to top