వరల్డ్ కప్ చూశారు, ధనాధన్ ట్వంటీ -ట్వంటీ చూశారు. కానీ ఇప్పుడు.. రాజమౌళి బాహుబలి పుణ్యాన మాహిశ్మతి ప్రీమియర్ లీగ్ కూడా స్టార్ట్ అయ్యింది. ఈ లీగ్ లో కూడా ఆటగాళ్ళు చాలా బాగా ఆడుతున్నారు. మాహిశ్మతి ఎలెవన్ జట్టు కొన్ని వికెట్లను కోల్పోయినప్పటికీ .. స్టార్ట్ బ్యాట్స్ మన్స్… భల్లాలదేవ, శివుడు ఇంకా క్రీజ్ లో ఉన్నారు. దీంతో భారీ స్కోర్ పై కన్నేసింది మహిశ్మతి ఎలెవన్ టీమ్.
ఏంటి అంతా కొత్తగా, వింతగా ఉందా.? అలాగే ఉంటుంది మనోళ్ళ క్రియేటివిటి అలాంటిది మరి. మనదేశంలో క్రికెట్ కు సినిమా కు విపరీతమైన అభిమానులుంటారు. ఈ సారి అభిమానులు సినిమాను, క్రికెట్ ను కలిపి కాక్ టెయిల్ చేశారు. దాని ఫలితమే ఈ మాహిశ్మతి క్రికెట్ జట్టు. బాహుబలి సినిమా అనుసరించి.. ఒక్కొక్క ప్లేయర్ ఎలా ? ఎలా అవుట్ అయ్యారు.. అనే డీటైల్స్ ను రూపొందించారు. వాటిని కింద స్కోర్ బోర్డ్ లో ఇవ్వడం జరిగింది.
కోచ్ రాజమౌళి కోచింగ్ లో మాహిశ్మతి జట్టు మంచి ఆటతీరును ప్రదర్శిస్తోంది. అమరేంద్ర బాహుబలి కెప్టెన్సీ, భల్లాలదేవ,శివుడు, కట్టప్ప లతో మాహిశ్మతి జట్టు బ్యాటింగ్ లైనప్ చాలా పటిష్టంగా ఉంది. దీంతో ఈ టీమ్ ను ఢీ కొట్టాలంటే ఇతర జట్లు భయపడుతున్నాయ్. కాలకేయ, శివగామిలు ఔట్ అయినప్పటికీ… శివుడు, భల్లాల దేవ అద్బుత ఆటతీరుతో అలరిస్తున్నారు.