జై సింహాలో బాలయ్య కార్ ఎత్తడంపై ఫన్నీగా “మహీంద్రా” చైర్మన్ ఎన్నారో తెలుసా.? చూసి నవ్వుకోండి..!

‘జై సింహా’తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నందమూరి బాలకృష్ణ మరోసారి సంక్రాంతి బరిలో విజేతగా నిలిచారు. తమిళ దర్శకుడు కేఎస్ రవికుమార్ తెరకెక్కించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదలై మాస్ ఆడియన్స్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ను కూడా ఎంతగానో ఆకట్టుకుంటోంది. బాలయ్య బాబు జై సింహా సినిమా లోని కొన్ని సీన్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బాలయ్య ఓ సన్నివేశంలో తన పవర్ చూపిస్తూ బొలెరో వాహనాన్ని ఒంటి చేత్తో ఎత్తుతాడు.. ఆ సన్నివేశానికి సంబంధించిన వీడియోను థియేటర్ లో చిత్రీకరించిన కొందరు దాన్ని సోషల్ మీడియాలో పెట్టారు. ఈ వీడియో విపరీతంగా షేర్ అవుతోంది. ఆ సన్నివేశంలో బాలయ్య బాబు ఎత్తిన కారు మహీంద్రా కంపెనీకి చెందిన ‘బొలెరో’.. ఆ వీడియో చివరికి మ‌హీంద్రా అండ్ మ‌హీంద్రా అధినేత ఆనంద్ మ‌హీంద్రా వరకూ వెళ్ళింది. విష్ణు చైత‌న్య అనే నెటిజ‌న్ ఈ వీడియోను ఆనంద్ మ‌హీంద్రాకి పంపించి, దీనిపై స్పందించాల‌ని కోరాడు. చైత‌న్య కోరిక మేర‌కు త‌న స్పంద‌న‌ను ఆనంద్ మ‌హీంద్రా ట్విట్ట‌ర్‌లో తెలిపారు.

watch video here:

https://www.youtube.com/watch?v=wy3NMeWf69M

దీనిపై ఆయన ఓ ఆస‌క్తిక‌ర కామెంట్ చేశారు.‘‘హాహా.. బొలెరో కార్లను చెక్ చేయాడానికి మా సర్వీసింగ్ సెంటర్లలో ఇకపై హైడ్రాలిక్ లిఫ్ట్‌లు వాడనవసరం లేదు’’ అని ట్వీట్ చేశారు. ‘జై సింహా’ సినిమాలోని ఆ సన్నివేశాన్ని ఓ నెటిజన్ ట్విట్టర్‌లో ఆయనకు ట్యాగ్ చేయడంతో ఆనంద్ మహింద్రా ఇలా సరదాగా స్పందించారు.

Comments

comments

Share this post

scroll to top