మహీంద్రా కంపెనీ వాహనాల పేర్ల చివ‌ర్లో….. ” O” ఉంటుంది…ఎందుకో తెలుసా? Boler0, ScarpiO, XylO…..!!

మహీంద్రా అండ్ మహీంద్రా గురించి,వారి వాహనాల గురించి పరిచయం అక్కర్లేదు కదా..కానీ మహింద్రా వాహణాల గురించి ఒక ఇంట్రస్టింగ్ టాపిక్ మాట్లాడుకుందామా..అదేంటంటే మహింద్రా వాహనాాల పేర్లను మీరెప్పుడైనా గమనించారా..మహింద్రా వారినుండి వచ్చిన ప్రతి వాహనం కూడా 0 తో ఎండ్ అవుతుంది..అవునండీ..న్యూమరాలజీ ప్రకారం అలా పెడుతున్నారో,లేదంటే లక్ కలిసి వస్తుందని పెడుతున్నారో వారికే తెలియాలి..కానీ ఒక పెద్ద మోటారు సంస్థ ఇలాంటి విషయాల పట్ల నమ్మకం కలిగి ఉండడం కొంచెం ఆశ్చర్యం కలిగించే విషయం..

మహీంద్రా వారు స్కార్పియో (SCARPIO)ను విడుదల చేసిన తరువాత, మహీంద్రా విలువ ఎంతో పెరిగింది. అంతే కాకుండా అసలైన విజయాన్ని స్కార్పియో ద్వారానే లభించింది.. ఆ పేరులో మంచి బలం ఉండటం మరియు చివరిలో O అక్షరం రావడటాన్ని అదృష్టంగా భావించామని స్వయంగా ఆనంద్ మహింద్రా ఒకసారి సమాధానమిచ్చారు.దాంతో మహీంద్రా నుండి వచ్చే ప్రతి మోడల్‌లో పేరుకు చివరిలో O అక్షరం వచ్చేలా నిర్ణయిస్తూ వచ్చామని చెప్పాడు. బొలెరో, స్కార్పియో లతో పాటు ఎక్స్‌యూవీ500, టియువీ300 మరియు గత ఏడాది విడుదలైన కెయువి100 కూడా మంచి సక్సెస్ సాధించిపెట్టాయి.

0 అక్షరంతో ఎండ్ అయ్యే కార్లు ,బైకులు,కమర్షియల్ వాహనాలు..

బొలెరో (Bolero), స్కార్పియో (Scorpio), జైలో (Xylo), క్వాంటో (Quanto), వెరిటో (Verito), ఎక్స్‌యూవీ500 (XUV500), టియువీ300 (TVU300) ,మోజో (Mojo), గస్టో (Gusto), సెంచ్యురో (Centuro), ప్యాంటెరో (Pantero), డ్యూరో (Duro), రోడియో (Rodeo).మ్యాక్సిమో (Maxximo), జీతో (Jeeto), సుప్రో (Supro), బొలెరే పికప్ ట్రక్కు (Bolero) మరియు ఇంపీరియో (Imperio) తో పాటు పెద్ద కమర్షియల్ శ్రేణిలో ట్రక్సో (Truxo) మరియు ట్రాకో (Traco)

0 అక్షరం లేని వాహనాలు,వాటి వెనుక కారణాలు.

మహీంద్రాలోని కొన్ని వాహనాలకు చివర్లో “O” అక్షరం ఉండదు కదా నిజమే, అలాంటి వాటిల్లో ఉదాహరణ అర్మాడా (Armada), థార్ (Thar), కమాండర్ (Commander) మరియు లోగాన్ (Logan).స్కార్పియో కంటే ముందుగా పరిచయం అయ్యాయి కాబట్టి వాటిలో O అక్షరం లేదు .కానీ లోగాన్ సెడాన్ మాత్రం 2007లో పరిచయం అయ్యింది అంటే స్కార్పియో తరువాత. మరి లోగాన్ పేరులో O లేదు కదా అని మరొక డౌట్ రావచ్చు

లోగాన్ వెనుక కథ..

మహీంద్రా లోగాన్ కారును ఫ్రెంచ్‌కు చెందిన రెనో భాగస్వామ్యంతో పరిచయం చేసింది. కాబట్టి వెహికల్ పేరును ఖరారు చేయడంలో ఇరు సంస్థల జోక్యం తప్పనిసరి. ఈ నేపథ్యంలో రెనోకు చెందిన లోగాన్ పేరును పెట్టారు. ఆ తరువాత కాలంలో లోగాన్ ఆధారంతో వెరిటో మరియు వెరిటో వైబ్ ఉత్పత్తులను అభివృద్ది చేసింది మహీంద్రా…భవిష్యత్లో మరిన్ని ఉత్పత్తులను ప్రవేశపెట్టనుంది..ఇలాంటివాటిని మూఢనమ్మకంగా కొట్టిపారేసేవారున్నారు ..కానీ మనిషి కృషిలేకుండా ఎలాంటి విజయాలు దక్కవనేది అందరూ ఒప్పుకోవాల్సిన నిజం.

 

Comments

comments

Share this post

scroll to top