“యత్ర నార్యస్తు పూజ్యంతే, రమంతే తత్ర దేవతాః
యత్రేతాస్తున పూజ్యంతే సర్వాస్తత్రాశురాః క్రియాః ”
ఎక్కడ స్త్రీలు గౌరవింపబడతారో, ఎక్కడ స్త్రీలను పరదేవతగా భావించి పూజిస్తారో, అక్కడ సర్వసంపదలూ ఉండడమేకాక రధ, గజ, తురగ పదాదులతో కూడిన లక్ష్మీ దేవి అచంచలయై నిలబడుతుంది…స్త్రీని దేవతగా పూజించే మన దేశంలో రోజురోజుకి స్త్రీలపై అగాయిత్యాలు పెరిగిపోతున్నాయి.నిర్భయ ఘటన జరిగిన తర్వాత నిర్బయ చట్టం వచ్చింది..అయినప్పటికీ కూడా స్త్రీలపై అత్యాచారాలు,హత్యలు ,దాడులు ఆగట్లేదు. తాజాగా పట్టపగలు.. చుట్టు ఉన్న జనం చూస్తుం డగానే రైలులో ఓ మహిళా సాఫ్ట్వేర్ ఇంజనీర్ పట్ల కొందరు పోకిరీలు అఘాయిత్యం చేయబోయారు. సూటిపోటి మాటలు.. వెకిలి చేష్టలతో అసభ్యంగా ప్రవర్తించే సరికి ఆ యువతి తట్టుకోలేకపోయింది. వారి చేతిలో అవమానం పాలయ్యే కంటే చావడం నయం అనుకుని నడుస్తున్న రైలు లోంచి కిందకు దూకేసింది.
అసలు ఏం జరిగింది??
చెన్నైలోని రెడ్ గటన్ గల్ఫ్ కంపెనీలో ట్రెయినీగా పనిచేస్తోంది నజ్బుల్లా.. పెళ్లిచూపులు అని ఇంటినుండి కబురు రావడం, వరుస సెలవులు ఉండడం తో ఇంటికి బయలుదేరింది. అదే కంపెనీలో పనిచేస్తున్న గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన ఎస్కే ఆరిఫా, విజయవాడ భవానీపురానికి చెందిన చెన్నగిరి వాసవి కూడా ఆమెతో పాటు బయలుదేరారు.
అంతా కలిసి ఎర్నాకుళం నుంచి నిజాముద్దీన్ వెళ్లే మిలీనియం ఎక్స్‌ప్రెస్ ఎస్-1లో బోగీ ఎక్కారు. అదే బోగీలో ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్ నగర్‌కు చెందిన ముగ్గురు ఆకతాయిలు ఎక్కారు. రైలు బయలుదేరినప్పటినుంచీ నజ్మల్పై ఏదో ఒక కామెంట్ చేస్తూనే ఉన్నారు. అసభ్యంగా మాట్లాడుతూ, సైగలు చేస్తూ.. వికృతంగా ప్రవర్తించడం మొదలుపెట్టారు. తట్టుకోలేకపోయిన నజ్మల్.. సింగరాయకొండ స్టేషన్ సమీపంలో కిందకు దూకేసింది. ఆ సమయంలో రైలు స్లోగా ప్రయాణిస్తుండటంతో.. ప్రాణాపాయం తప్పింది. ఆమె స్నేహితులు వెంటనే స్పందించి, చైన్ లాగారు. గాయపడిన నజ్బుల్లా ను రైల్వే పోలీసులు ఒంగోలు రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ప్రకాశం రైల్వే పోలీసులు ఇచ్చిన సమాచారంతో.. విజయవాడ రైల్వే అధికారులు అప్రమత్తం అయ్యారు. ఎక్స్‌ప్రెస్ విజయవాడ రైల్వే స్టేషన్‌కు చేరగానే, ఎస్-1 బోగీలోని ఖుర్బాన్ అహ్మద్, సందగల్ ఖాన్, హరితేజ్ యాదవ్ అనే నిందితులను అదుపులోకి తీసుకొన్నారు.
చదువుకుని,తోడుగా ఇద్దరు స్నేహితులున్నప్పటికి ఆకతాయిల మాటలు భరించలేక ట్రెయిన్ లోనుండి దూకేసిందంటే వాళ్లు ఎంతలా వేధించుంటారో అర్దం అవుతుంది.ధైర్యంగా ఎదుర్కోలేని పరిస్థితిలో స్త్రీ ఉన్నదని తెలుస్తుంది.ఇలాంటి ఘటనలు జరగ్గానే అమ్మాయిలపట్ల సానుభూతి,అబ్బాయిల పట్ల కోపం రావడం ..ఘటనలను ఖండించడం..మళ్లీ నాలుగురోజులుగా మాములుగానే ఘటనలు జరగడం పరిపాటి అయిపోయింది..ఇంకోసారి పునరావృతం కాకూడదుఅనుకుంటే మార్పు రావల్సింది మనలో..మొత్తం వ్యవస్థలో మార్పోస్తే తప్ప ఇలాంటి ఘటనలకు చరమగీతం పాడలేం..