మహిళలు రెగ్యులర్ గా ఉపయోగించే ఈ 6 మెడిసిన్స్ ఎంత ప్రమాదమో తెలుసా.? అస్సలు వాడకండి.!

మెఫ్తాల్ స్పాస్
నెలసరి సమయంలో వచ్చే కడుపునొప్పి తాళలేక చాలామంది మెఫ్తాల్ స్పాస్ ట్యాబ్లెట్ వేసుకుని రిలాక్స్ అవుతుంటారు.నెలనొప్పి అప్పుడు కడుపునొప్పి,కాళ్లు తిమ్ముర్లు,ఒళ్లు నొప్పుల నుండి ఉపశమనం ఉన్నప్పటికి,ధీర్ఘకాలికంగా ఈ ట్యాబ్లెట్ వలన నష్టం ఏర్పడుతుంది.ముఖ్యంగా క్యాన్సర్ లేదా వ్యందత్వం బారిన పడే అవకాశముంది.అంతేకాదు ఊపిరితిత్తులు,కిడ్నీలు కూడా ఎఫెక్ట్ అయ్యే ప్రమాదం ఉంది.
విటమిన్ ఎ 
విటమిన్‌ ఎ మాత్రలు మహిళలు ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. రుతుక్రమం సమయంలో ఎక్కువ బ్లీడింగ్‌ అయినా లేదా, యోనికి సంబంధించిన అంటువ్యాధులను అరికట్టేందుకు వీటిని ఉపయోగిస్తారు. అలాగే ఈస్ట్‌ ఇన్ఫెక్షన్‌, పీఎంస్‌ (ప్రీమెన్స్ట్రల్‌ సిండ్రోమ్‌) లకు కూడా మహిళలు వీటిని ఉపయోగిస్తారు. ఈ విటమిన్స్‌ టాబ్లెట్లను అధికంగా తీసుకోవడం వల్ల అలసట, అనోరెక్సియా, అజీర్తి, గర్భస్రావం వంటి సమస్యలు వస్తాయి. అందువల్ల వీలైనంత వరకు వీటిని తక్కువగా ఉపయోగించాలి.
 
డార్ట్
సాధారణంగా తలనొప్పి లేదా ఒంటినొప్పులకు డార్ట్‌ మాత్రలు వేసుకుంటూ ఉంటారు. అయితే ఇది శరీరానికి బాగా హాని కలిగించే మెడిసిన్‌. వాస్తవానికి ఈ మాత్రల్ని నిషేధించారు. అయినా కొన్ని మెడికల్‌ స్టోర్స్‌, ఆన్‌లైన్‌ స్టోర్లలో ఇప్పటికీ అందుబాటులో ఉన్నాయి.దీనిని ఎక్కువగా వాడడం వలన మూత్రపిండాలకు సంబంధించిన వ్యాధులు, గర్భస్రావం వంటి వాటి బారిన పడాల్సి వస్తోంది. అందువల్ల వీటిని ఉపయోగించకపోవడం ఉత్తమం.
 
పారసెటమాల్
పారాసెటమాల్‌ మాత్రలు గురించి తెలియని అమ్మాయి ఉండదంటే అతిశయోక్తి కాదు.తలనొప్పి వచ్చినా పారసిటమాల్,జ్వరం వచ్చినా పారసిటమాల్ ఇలా ప్రతిదానికి వాడుతూనే ఉంటారు.. పారాసెటమాల్‌ మాత్రలు ఎక్కువగా వినియోగిస్తే మీరు భవిష్యత్తులో కాలేయ సమస్యకు గురవుతారు.
 
విటమిన్ సి
విటమిన్‌ సి అనేది మన శరీరంలోని ఎముకలు, రక్త నాళాలు, కండరాల పని తీరును మెరుగుపరిచేందుకు బాగా ఉపయోగపడతాయి. వీటివల్ల కొన్ని ఫలితాలు ఉన్నాయి. అయితే ఎక్కువగా ఈ ట్లాబెట్స్‌ ఉపయోగిస్తే మాత్రం చాలా ఇబ్బందులకు గురికావాల్సి వస్తుంది. మహిళల్లో గర్భస్రావం వంటి వాటికి ఇవి కారణమవుతాయి. అందువల్ల మహిళలు వీలైనంత వరకు వీటిని తక్కువగా ఉపయోగించండి.
 
అల్ఫ్రాజోలెం
దీన్ని దాదాపుగా ఆందోళన, పానిక్‌ రుగ్మతల చికిత్సకు ఎక్కువగా ఉపయోగిస్తారు. అయితే ఎక్కువగా ఈ ట్యాబెట్స్‌ తీసుకుంటే మాత్రం చాలా ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుంది. స్త్రీలలో అండోత్పత్తి సమస్యలు ఏర్పడుతాయి.కాబట్టి మనకు ఏ చిన్న అనారోగ్యం కలిగిన డాక్టర్ ను సంప్రదించి మందులు వాడాలి తప్పితే సొంత ప్రయోగాలు వద్దు,దాని ఫలితంగా మరిన్ని కొత్త సమస్యలు కొనితెచ్చుకోవద్దు.

Comments

comments

Share this post

scroll to top